హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డెటాల్ స్నానం,దున్నపోతుతో కోటి సంపాదన(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హర్యానాలోని ఓ దున్నపోతు ఏడాదికి రూపాయలు కోటి సంపాదన తెచ్చిపెడుతోంది. ప్రతి దీపావళి పండుగ సమయంలో హైదరాబాదులో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

తాజాగా, హైదరాబాదులో జరిగిన సదర్ ఉత్సవంలో హర్యానా నుంచి తీసుకు వచ్చిన దున్నపోతును ప్రదర్శించారు.

ఈ దున్నపోతు పేరు యువరాజు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన బాబెయిన్ అనే పాడి రైతు వద్ద యువరాజు అనే ఈ దున్న ఉంది.

దున్న 'యువరాజు'

దున్న 'యువరాజు'

హైదరాబాద్ నగరంలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాల కోసం అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ దీనిని నగరానికి తీసుకొచ్చారు. ఈ యువరాజ్... భోగభాగ్యాలు అనుభవిస్తోంది.

దున్న 'యువరాజు'

దున్న 'యువరాజు'

దీని ఆహారం... రోజుకు పదిహేను కిలోల సేపులు, 30 లీటర్ల పాలు, ఐదు కిలోల క్యారెట్, ఐదు కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, ఐదు కిలోల బెల్లం, దాణా, వివిధ రకాల పప్పుల పొట్టు, మొక్కజొన్న పొట్టు, టమాటోలు, మొసాంబీని మేతగా వేస్తారు.

 దున్న 'యువరాజు'

దున్న 'యువరాజు'

అంతేకాదు, రోజూ డెటాల్‌తో స్నానం చేయిస్తారు. ఖరీదైన నూనెలతో మసాజ్ చేయిస్తారు. ఈ దున్న ముర్రా జాతికి చెందినది. దీని వయస్సు ఏడు ఏళ్లు. ఈ దున్న యువరాజు బరువు 1600 కేజీలు. ఆరున్నర అడుగుల ఎత్తు, 14 అడుగుల పొడువున్న దీనిని 12 టైర్ల లారీపై తీసుకొచ్చారు.

 దున్న 'యువరాజు'

దున్న 'యువరాజు'

ఈ లారీని అనుసరిస్తూ మరో మూడు వాహనాలు తరలి వచ్చాయి. జాతీయస్థాయి పశు ప్రదర్శనల్లో 12సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఈ దున్న యువరాజు సొంతం. తిండికి తగ్గ పని చేయలేకున్నా, యజమానికి అంతకంటే ఎక్కువ ఆదాయాన్నే సమకూరుస్తోంది.

దున్న 'యువరాజు'

దున్న 'యువరాజు'

దీని నుంచి సేకరించే వీర్యంతో ఏటా కోటి రూపాయలు సంపాదిస్తున్నాని యజమాని బాబెయిన్ చెబుతున్నారు. ప్రస్తుతం డీఎల్ డెయిరీఫామ్ (ముషీరాబాద్)లో ఉన్న యువరాజుని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. దీనిని యువరాజును రూ.7.5 కోట్లకు కొంటామని ముందుకొచ్చినా యజమాని అమ్మనని చెబుతున్నాడు.

English summary
1,600 KG Haryana bull in Hyderabad Sadar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X