హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కస్టమర్‌ను గాయపర్చిన బార్బర్‌కు జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించి తమ వద్దకు వచ్చిన ఓ కస్టమర్‌ను గాయపర్చిన బార్బర్‌పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది. గడ్డం గీయించుకునేందుకు వచ్చిన ఓ కస్టమర్‌ను తాగిన మైకంలో బార్బర్ బ్లేడ్‌తో గాయపర్చిన కేసును కోర్టు తీవ్రంగా పరిగణించింది.

కేసును విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధించింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సలీంనగర్ డివిజన్ బాలదానమ్మ బస్తీకి చెందిన రవీందర్.. సలీంనగర్ ప్రధాన రహదారిలోని ఫుట్‌పాత్‌పై క్షౌర వృత్తి నిర్వహిస్తున్నాడు.

A Barber jailed for injuring customer

2011 ఏప్రిల్ 17న నాచారానికి చెందిన షేక్ హుస్సేన్ గడ్డం గీయించుకునేందుకు అతడి వద్దకు వెళ్లాడు. అనంతరం రవీందర్ రూ. 25 బదులు 50 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హుస్సేన్ నిరాకరించాడు. తాగిన మైకంలో ఉన్న రవీందర్ షేవింగ్ బ్లెడ్‌తో హుస్సేన్‌పై దాడి చేశాడు.

దీంతో బాధితుడు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టు నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

English summary
A Barber jailed for injuring customer, in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X