వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసాధారణం: ఢాకాలో రెండుతలల శిశువు జననం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ ఆసుపత్రిలో ఓ శిశువు రెండు తలలతో జన్మించింది. రాజధాని ఢాకాకు వంద కిలోమీటర్ల దూరంలోని బ్రహ్మంబారియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బుధవారం రాత్రి కాన్పు కష్టంగా మారిన ఓ మహిళకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు ఈ రెండు తలల శిశువును బయటకు తీశారు. తలలను మినహాయిస్తే మిగతా అవయవాలన్నీ మిగతా శిశువులాగే సాధారణంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

 Baby with two heads born in Bangladesh, doctors say

ప్రస్తుతం ఈ శిశువుని ఢాకాలోనే పెద్ద ఆసుపత్రి అయిన స్టాండర్డ్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మా బిడ్డను చూడగానే ఆశ్యర్యానికి లోనయ్యాను. తలలు రెండూ పూర్తిస్థాయిలో ఎదిగాయని, తను చూసిన సమయంలో రెండు ముక్కులతో శ్వాస పీల్చుకుంటోందని పాప తండ్రి జమాల్‌ మియా వివరించారు.

అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, అసాధారణంగా జన్మించినా పాప, తల్లి ఇద్దరూ క్షేమంగా ఉండడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. అసాధరణంగా జన్మించిన ఈ ఘటన గురించి స్థానికంగానే పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు.

ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ శిశువుని చూసేందుకు వెల్లువలా వస్తున్నారు. 2008లో కూడా రెండు తలలతో శిశువు జన్మించినా ఆ తర్వాత కొన్ని రోజులకే చనిపోయింది.

English summary
The baby was born late Wednesday and is now being treated for breathing difficulties after being shifted to the intensive care unit of the country's largest hospital in Dhaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X