వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లోనే ఉండి ఎన్నికల్లో గెలిచిన బీహార్ ‘బాహుబలి’

|
Google Oneindia TeluguNews

పాట్నా: టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తీసిన సినిమాలోని బాహుబలి కాదు. బీహార్‌లో అంతకుముందే ఓ బాహుబలి ఉన్నాడు. ఆయనే అనంతసింగ్ అలియాస్ చోటే సర్కార్. పలు నేరాల్లో నిందితుడిగా ఉన్న ఆయన రాజకీయంలోకి రంగ ప్రవేశం చేసి జైలులో నుంచి గెలుపొందాడు.

వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు జేడీయూ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి పలు నేరారోపణల కారణంగా జైలుకు వెళ్లి ఆ పార్టీని వదిలేసిన అనంత సింగ్(బాహుబలి) మరోసారి తన సత్తా చాటాడు. ఒక్కరోజు కూడా ప్రచారంలో పాల్గొనకుండా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. జైలులో ఉండే.. జేడీయూ పార్టీకి చెందిన అభ్యర్థిని మట్టకరిపించాడు.

2005, 2010లో జేడీయూ టికెట్‌పై అనంత సింగ్ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే కిడ్నాప్, హత్యలు, అత్యాచారాల కేసులో జైలు పాలయ్యాడు. దీంతో అతడు పార్టీని వీడాల్సి వచ్చింది.

Bahubali legislator anant singh makes it from jail

ఆ తర్వాత అతడు చాలా నెలలుగా జైలులోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి ఎన్నికలు రావడంతో తిరిగి ఒకప్పుడు తాను బరిలోకి దిగిన మోకామా నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఇదే స్థానంలో జేడీయూ తరుఫున బరిలో నిలిచిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్‌పై గెలిచి మరోసారి సత్తా చాటాడు.

మొత్తం 18,348 ఓట్ల మెజారిటీతో నెగ్గాడు. మొత్తం ఓట్లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ సింగ్‌కు 54,005 ఓట్లు పోలవ్వగా.. జేడీయూ అభ్యర్థి నీరజ్ కుమార్‌కు 35,657 ఓట్లు లభించాయి. కాగా, బీహార్ ఎన్నికల్లో నితీష్ కూటమి భారీ విజయం సాధించగా, ఎన్డీఏ కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే.

English summary
Bahubali legislator anant singh elected as a MLA in recent Bihar assembly elections from jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X