వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియోలతో బెదిరిస్తున్నాడు: క్రికెటర్‌పై గర్ల్‌ఫ్రెండ్ మళ్లీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ మళ్లీ వివాదంలో చిక్కుకుపోయాడు. కొద్ది రోజుల క్రితం, తన పైన అత్యాచారం చేశాడని బంగ్లాదేశ్ నటి నజ్నీన్ అక్తర్ హ్యాపీ రూబెల్ పైన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె అతని పైన మరో ఆరోపణ చేసింది.

తనకు చెందిన రహస్య చిత్రాలను, వీడియో క్లిప్పులును బయటపెడతానంటూ రూబెల్ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి రూబెల్‌తో జరిగిన సంభాషణ వీడియోలను యూట్యూబ్‌లో పెట్టింది. న్యాయస్థానానికి కూడా సమర్పించింది. కాగా, ఆ వీడియోలో నటి నజనీస్‌ను రూబెల్ బెదిరించినట్లుగా ఉంది.

Bangladesh cricketer Rubel 'threatens' to leak explicit pictures of girlfriend Najnin

కాగా, ప్రపంచ కప్‌కి ముందు హుస్సేన్‌పై అత్యాచార ఆరోపణలు చేసిన ఈ బంగ్లాదేశ్ నటి నజ్నీన్ అక్తర్ (19) ఆ తర్వాత కొద్ది రోజులకు కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. గతంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని హుస్సేన్‌పై కేసు పెట్టింది.

ప్రపంచ కప్‌కు వెళ్లేముందు రూబెల్ కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. దీంతో వరల్డ్ కప్‌కు వెళ్లేది కూడా అనుమానంగా మారినా, దేశ ప్రయోజనాలు దృష్ట్యా అతనికి ప్రపంచ కప్ ముగిసేంత వరకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రపంచ కప్‌లో ఓ మ్యాచ్ అనంతరం నజ్నీన్ ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను హుస్సేన్‌ని క్షమించేశానని, కేసుని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. తాజాగా, మరోసారి బెదిరింపు ఆరోపణలు చేయడం గమనార్హం.

English summary
Bangladesh cricketer Rubel 'threatens' to leak explicit pictures of girlfriend Najnin
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X