వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంసం సంస్థతో బిజెపి ఎమ్మెల్యేకు సంబంధం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: మాంసం విషయంలో ఉత్తర ప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే, దాద్రిలో ఆవు మాంసం వినియోగానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బిజెపి ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు సోమ్‌కు స్వయంగా మాంసం వ్యాపారంతో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

హలాల్ చేసిన మాంసాన్ని ఉత్పత్తి చేయడంతోపాటు దానిని ఎగుమతి చేస్తున్న అల్ దువా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో సోమ్ డైరెక్టర్‌గా ఉన్నట్లు ఆ సంస్థ స్టాక్ ఎక్సేంజికి సమర్పించిన వివరాలను బట్టి స్పష్టమవుతోందని అంటున్నారు.

స్టాక్ ఎక్సేంజిలో రిజిస్టర్ అయిన నాటి నుంచి అల్-దువాలో మూడేళ్లపాటు డైరెక్టర్‌గా పని చేసిన సోమ్ ఆ తర్వాత 2008లో ఆ సంస్థ బోర్డుకు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

BJP's leading anti beef crusader owned a meat exporting company

మాంసం ఉత్పత్తి, కొనుగోళ్లు, అమ్మకాలు, ఎగుమతులు నిర్వహించే ఈ సంస్థ 2005లో స్టాక్ ఎక్సేంజిలో రిజిస్టర్ అయినప్పుడు సంబంధిత ఒప్పందంపై తొలి సంతకం చేసింది సోమేనని ఆ సంస్థ రికార్డులు చెబుతున్నాయంటున్నారు.

అయితే అల్-దువా సంస్థతో తనకు ఎటువంటి సంబంధాలు లేవని సోమ్ చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను కనీసం కోడిగుడ్డు కూడా తిననని, మాంసం వ్యాపారం చేయడమన్నది పూర్తిగా అసంగతమైన ప్రశ్న అన్నారు.

English summary
BJP's leading anti beef crusader owned a meat exporting company
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X