వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దైవ నిర్ణయానికి విరుద్ధం: గే మ్యారేజ్‌పై బాబీ జిందాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా కేర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాల పైన తాజాగా అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆడా, మగ వివాహాలు దైవ నిర్ణయాలు అని చెప్పారు. స్వలింగ సంపర్క వివాహాలు అనైతికమని చెప్పారు. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీం తీర్పు శరాఘాతమన్నారు. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్క వివాహాలను ప్రోత్సహించడం సరికాదన్నారు.

Bobby Jindal administration says Louisiana won't recognize gay marriage yet

ప్రజాభిప్రాయ సేకరణ, రాష్ట్రాల ఆమోదం లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని, జ్యూడిషియరీ సభ్యులు తమ సొంత అభిప్రాయాలను ప్రజల పైన రుద్దుతున్నారన్నారు. లూసియానా గే మ్యారేజ్‌ను అంగీకరించదని చెప్పారు.

English summary
Bobby Jindal administration says Louisiana won't recognize gay marriage yet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X