హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆశ: ముంచేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి కాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అత్యాశకు పోతే అంతా మునిగిపోయారు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు తమకు పిలుపు వస్తుందనే ఆశతో ఎదురు చూసినవారు జరిగిన మోసం తెలుసుకుని విస్తుపోయారు. కౌన్ బనేగా కరోడ్‌పతి టీమ్ మెంబర్ అంటూ చెప్పుకున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినవారు కాస్తా ఆశ్చర్యపడినప్పటికీ మురిసిపోయారు. ఫోన్ నెంబర్‌ను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని షోకు ఆహ్వానిస్తున్నట్లు అతను వారికి చెబుతూ వచ్చాడు.

ఓ వ్యక్తికి ఫోన్ చేసి సెల్ సర్వీస్ ప్రొవైడర్ ర్యాండమ్‌గా ఎంపిక చేసిన మేరకు కాల్ చేసినట్లు టీమ్ మెంబర్‌ను అంటూ చెప్పుకున్న వ్యక్తి నమ్మబలికాడు. ఎంట్రీ ఫీజు కింద 15 వేల రూపాయలు డిపాజిట్ చేయాలని కాలర్ చెప్పాడు. అలా ఫోన్ కాల్స్ అందుకున్న వ్యక్తులు 15 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసారు.

Call from Kaun Banega Crorepati? Check before replying

డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత తిరిగి ఫోన్ చేస్తే అది రిజెక్ట్ కాల్ కింద ఆ వ్యక్తి సెల్‌ను పెట్టేసినట్లు తెలిసింది. మరో నెంబర్‌కు ఫోన్ చేస్తే తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. కెబిసి ప్రొడక్షన ్ టీమ్ సభ్యుడినని చెప్పుకుని అలా ఫోన్ కాల్స్ అందుకున్నవారు మోసపోయారు.

దాదాపు 30 మంది 15 వేల రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజు పేరు మీద డిపాజిట్ చేశారు. అలా మోసపోయినవారు టెక్కీలు, ప్రొఫెషనల్స్, విద్యార్థులు మోసపోయినవారిలో ఉన్నారు. కాలర్ మంచి ఆంగ్లంలో, హిందీలో మాట్లాడినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డిసిపి రవి వరమ్ చెప్పారు. ఈ కుంభకోణం వెనక ఉత్తర భారతదేశం ముఠా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. దక్షిణ భారతదేశం ప్రజలను టార్గెట్ చేసుకోవడం వల్ల తమను పట్టుకోరనే ఉద్దేశంతో ఆ ముఠా సభ్యులు ఉండవచ్చునని అంటున్నారు.

English summary
The callers tell their victims that they have been selected for the game, or that they have won a lottery of KBC. At least 30 residents paid thousands in order to get a seat on the programme, according to the Central Crime Station police. They include students, techies, and professionals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X