వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూపాయి అడిగితే, తన్నిన మహిళా మంత్రి(వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి... ఓ వ్యక్తి రూపాయి దానం అడిగినందుకు కాలితో తన్నారు. ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఇది వివాదాస్పదమైంది. ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే మానవత్వాన్ని మరిచారు.

దానంగా ఒక రూపాయి అడిగాడనే కారణంతో ఓ అడుక్కునే పిల్లాడిని కాలితో తన్నింది సదరు మహిళా మంత్రి. భోపాల్‌కు సమీపంలోని పన్నాలో జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక బస్టాండ్‌లో చెత్త ఊడ్చే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

Caught on Camera: Madhya Pradesh Minister Kicks Teenager

ఈ కార్యక్రమం ముగించుకొని వెళుతుండగా దానం చేయాలని ఓ పిల్లాడు అభ్యర్థించాడు. దాంతో అసహనానికి గురైన మంత్రి బాలుడిని కాలితో తన్నారు. అంతటితో ఆగకుండా పసివాడిపై అంగరక్షులు చేయిచేసుకున్నారు. మంత్రి తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నది.

మంత్రివర్గం నుంచి కుసుమ్ మెహ్దేలేను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా, సదరు మహిళా మంత్రి గతంలోను వివాదాల్లో కూరుకుపోయారు. ఇటీవల సింహాలను, పులులను ప్రజలు పెంచుకొనే విధంగా చట్టాన్ని రూపొందించాలని వ్యాఖ్యానించారు.

English summary
Madhya Pradesh animal husbandry minister Kusum Mehdele has landed herself into a fresh controversy by kicking away a small boy who begged on his knees and asked for a rupee, during her visit to Panna on Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X