వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్: లీటర్ మేక పాలు రూ. 2 వేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజదాని ఢిల్లీలో మేకపాల ధర ఆకాశాన్నంటింది. లీటరు మేకపాల ధర ఒక్కసారిగా రూ.2 వేలకు పెరిగింది. డెంగ్యూ సోకినవారి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోవడంతో మరణం సంభవిస్తుంది. వ్యాధిపీడితులకు మేకపాలు ఇస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందన్న పుకారుతో, వైద్యులు సలహా ఇచ్చారనే ప్రచారంతో జనం ఎగబడటమే ఇందుకు కారణమని అంటున్నారు.

అయితే, ఢిల్లీ పరిసర గ్రామాలతోపాటు గుడ్‌గాఁవ్‌లో అధికశాతం మేకలు చూడి దశలో ఉండటంవల్ల కొద్ది పరిమాణంలో మాత్రమే మేకపాలు లభిస్తున్నాయని పెంపకందారులు తెలిపారు. అందువల్లనే సాధారణంగా రూ.35-40 మధ్య పలికే లీటరు ధర ఒక్కసారిగా రూ.500 నుంచి 2వేలకు పెరిగిందని అంటున్నారు.

Dengue cure rumour spikes goat milk price

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంత నగరాల్లో కూడా మేక పాలు ధర విపరీతంగా పెరిగింది. లీటరు మేకపాల ధర రూ.850 పలుకుతోంది. ప్రస్తుత స్థితిలో దాని ధర మరింత పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే, మేక పాలు డెంగ్యూ వ్యాధిని నయం చేస్తాయని శాస్త్రీయంగా రుజువు కాలేదని వైద్యులు అంటున్నారు.

ఫ్లూయిడ్స్‌తోనే డెంగ్యూ వ్యాధి నయమవుతుందని చెబుతున్నారు. గంటకు కిలోకు 100 మిల్లీలీటర్ల చొప్పున స్వైన్ ఫ్లూ రోగికి ఫ్యూయిడ్స్ అవసరమవుతాయని చెబుతున్నారు. సోడియం, కాల్షియం, పంచదార ఉన్న ఏ ద్రవపదార్తమైనా సరిపోతుందని చెబుతున్నారు. పాలే కావాలని ఏమీ లేదని, లెమన్ - షుగర్ - సాల్ట్ కలిపిన నీళ్లు తాగిన సరిపోతుందని చెబుతున్నారు.

English summary
The demand for goat milk has shot up - pushing prices to a stunning Rs 850 per litre in some of the western UP cities to treat dengue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X