కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలివైనదానివి: విద్యార్థిని ఇచ్చిన ఝలక్‌కు బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు: విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో వీణ అనే విద్యార్థిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలను ప్రారంభించడానికి గడువు విధిస్తూ పారిశ్రామికవేత్తలను హడలెత్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ విద్యార్తిని ప్రశ్నకు ఆశ్చర్యచకితులయ్యారు.

ఆ విద్యార్తిని వేసిన ప్రశ్నకు చంద్రబాబు ప్రతిస్పందిస్తూ నువ్వు నాకన్నా తెలివైనదానివని వ్యాఖ్యానించారు. దాంతో బిత్తరపోయిన విద్యార్థిని లేదు, సార్ అంటూ పదే పదే చెప్పుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామం వద్ద పారిశ్రామికవాడకు ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పారిశ్రామికవేత్తలకు భూమి మంజూరు పత్రాలను అందజేశారు.

 Girl student Veena questions Chandrababu


భూమి అప్పగించాం, పరిశ్రమల్లో ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభిస్తారని పారిశ్రామికవేత్తలను ప్రశ్నించారు. కంపెనీల స్థాయిని బట్టి పారిశ్రామికవేత్తలు గడువు చెబుతుండగా ముఖ్యమంత్రి కల్పించుకుని తానే గడువు ఇస్తానని, అంతలో పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతుల గురించి తాము చూసుకుంటామని ఇతర పనులు వెంటనే ప్రారంభించి ఇచ్చిన గడువు కంటే ముందే ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు.

అనంతరం చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కర్నూలు వాసవి కళాశాలకు చెందిన వీణ అనే విద్యార్థిని మాట్లాడుతూ పరిశ్రమల ప్రారంభానికి గడువు విధించి చాలా మంచి పని చేశారని పొగుడుతూనే, కర్నూలును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని మీరు గతంలో చెప్పారని, ఈ పనిని మీరెప్పుడు ప్రారంభిస్తారని సిఎంను ప్రశ్నించారు.

దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యచకితులయ్యారు. సుందర నగరంగా తీర్చిదిద్దే విషయంపై మాట్లాడుతుండగా గడువు ఎప్పుడో చెప్పాలని వీణ మరో మారు ప్రశ్నించారు. ఏడాదిలోగా కర్నూలును సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని, ఆ తరువాత ప్రణాళికాబద్ధంగా మోడరన్ సిటీగా తయారు చేస్తామని బాబు సమాధానం చెప్పారు.

గడువు చెప్పాలని ముఖ్యమంత్రినే విద్యార్థిని నిలదీయడంతో సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. ‘నా కంటే తెలివైనదానివే. అందరినీ నేను ప్రశ్నించి గడువు విధిస్తే, నీవు నాకే గడువు విధించావు' అంటూ వీణను సిఎం ప్రశ్నించారు.

English summary
A girl student from Vasavi college in kurnool questioned Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X