వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాలీవుడ్ పైత్యం: ‘శ్రీకృష్ణుడిపై అనుచిత డైలాగ్స్‌’

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: వచ్చే ఏడాది విడుదల కానున్న ఓ హాలీవుడ్ చిత్రంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలున్నాయని హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర మతాల సాంప్రదాయాలను గౌరవించే హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

‘చరిత్రనూ, హిందూ సంస్కృతినీ, దేవతలనూ కించపరుస్తూ సినిమాల్లో డైలాగులు రాయడం సాధారణం అయిపోయింది. దీన్ని ఏమాత్రం సహించం' అని అంతర్జాతీయ హిందూ సంఘాల ప్రతినిధులు రాజన్ హెచ్చరించారు.

వచ్చే ఏడాది విడుదల అవుతున్న చిత్రం ‘ఎక్స్‌-మెన్'. దీనికి ట్యాగ్‌లైన్‌ ‘ఎపొకలిప్సీ'. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవలే విడుదల అయింది. ఈ ట్రైలర్‌లో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఎపొకలిప్స్‌ తనను గురించి చెప్పుకుంటూ ‘నన్ను చాలా పేర్లతో పిలుస్తారు. ఒకప్పుడు ‘రా' అనేవారు, తర్వాత ‘కృష్ణ' అన్నారు, ఇంకొందరు ‘ఎహ్వె' అన్నారు..' అంటూ ఓ డైలాగ్‌ చెప్తాడు.

‘అసలు హిందూ పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడి గురించి వీళ్లకు ఏం తెలుసు? ఏమీ చదవకుండా వీళ్లు ఇలాంటి పనికిమాలిన డైలాగులు రాస్తారా? ముందు ఈ హాలీవుడ్‌ వాళ్లంతా హిందూ చరిత్ర, సంస్కృతి పాఠాలను చదువుకోవాలి' అంటూ యూనివర్సల్‌ సొసైటీ ఆఫ్‌ హిందూయిజమ్‌ ప్రతినిధి రాజన్‌ ఘాటుగా స్పందించారు.

ఈ డైలాగ్‌లలోని తప్పులను సరిదిద్దుకోవాలనీ, లేకపోతే తప్పులు చేసే వారిని పురాణాల్లో శ్రీకృష్ణుడు ఎలా శిక్షించాడో తాము వీళ్లకు ప్రత్యక్షంగా తెలియజేస్తామని ఆయన హెచ్చరించారు.

English summary
A United States-based Hindu leader Rajan Zed has objected to the comparison of the villain of Hollywood movie 'X-men; Apocalypse' with lord Krishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X