హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాహుబలి సినిమా గుర్రాలు జుమేరాత్ బజార్‌వే

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేక్షక జనాదరణ పొందిన బహుబలి చిత్రంలో అశ్వాల జోరు చూశాం. ప్రేక్షకులకు కనువిందు చేసి, యుద్ధరంగంలో దూసుకెళ్లిన గుర్రాలు ఎక్కడివనే ఆలోచన రావడం సహజం. బహుబలి, కట్టప్ప కదనరంగంలో పరుగులు పెట్టించిన గుర్రాలను మెచ్చుకోని వారుండరు.

ఆ శ్వాలు హైదరాబాదు నగరానికి చెందినవే కావడం విశేషం. హైదరాబాద్ పాతబస్తీలోని జుమ్మెరాత్ జబార్‌లోనివే ఆ గుర్రాలు. వీటి శిక్షకులు కూడా హైదరాబాదీలే. బాహుబలి మొదటి భాగంలోనే కాకుండా రెండో భాగంలో కూడా ఈ గుర్రాలు ఆకట్టుకోనున్నాయి.

బాహుబలి రెండో పార్ట్‌లో నటి అనుష్క వినియోగించే తెల్ల గుర్రం(బర్ఫీ) కూడా ఈ ప్రాంతానికి చెందిందే. హీరో ప్రభాస్, ప్రతి నాయకుడు రాణా, కట్టప్ప వాడిన గుర్రాలు సైతం ఇక్కడివే. మొదటి పార్ట్‌లో ఈ గుర్రాల పని తీరు బాగా ఉండడంతో నిర్మాత రెండో భాగంలోనూ వీటినే ఎంపిక చేసి సినిమా చిత్రీకరణకు తరలిస్తున్నట్లు గుర్రపు శాల యజమాని మహ్మద్ జబీరుద్దీన్ ఓ ప్రముఖ దినపత్రికకు చెప్పారు.

Horses in Baahuibali film are from Hyderabad

జుమేరాత్ బజార్‌లోని గుర్రపుశాలలో దాదాపు 150 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలను అక్కడి వారు సినిమా షూటింగ్‌లకే కాకుండా బారాత్‌లకు కూడా ఇస్తారు. జుమేరాత్ బజార్ పాత వస్తువుల విక్రయానికి పేరు మోసింది. ప్రతి గురువారం అక్కడ సంత జరుగుతుంది.

జుమేరాత్ బజార్‌ సంత చోరీ వస్తువుల విక్రయానికి పేరు మోసింది. దానికి చోర్ బజార్ అని కూడా పేరుంది. దొంగతనం చేసిన వస్తువులన్నీ ఇక్కడి వస్తాయని, ఇక్కడ విక్రయాలు జరుగుతాయని అంటారు. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. అలాగే, దీని పక్కనే ఓంట్వాడా ఉంటుంది. ఇక్కడ ఒంటెలను పెంచుతుంటారు. బారాత్‌లకు, సినిమాలకు వాటిని కిరాయికి ఇస్తారు.

English summary
The horses used in Baahubali film are from Jummeraat bazar in old city of Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X