వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ హిందూదేశం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత దేశం హిందూ దేశమని, హిందువులు అందరూ సంఘటితమయ్యేందుకు ఇదే మంచి తరుణమని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ శనివారం వ్యాఖ్యానించారు. మీరట్, ఘజియాబాదులలో ఆదివారం ఆయన ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

హిందువులకు, ముస్లీంలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యేమార్గం ఉద్భవిస్తుందని చెప్పారు. అదే హిందుత్వ మార్గమని విశ్వకవి రవీంద్ర నాథ్ ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు.

India is a 'Hindu Rashtra': RSS chief Mohan Bhagwat

మనం చేయాల్సింది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలని, మనలో మనం కలహాలు సృష్టించుకుంటే ఈ రాజ్యాంగం మనలను కాపాడలేదని చెప్పారు. ప్రతికూల పరిస్థితులలోను ఆరెస్సెస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ ఆరెస్సెస్ శాఖలను ప్రారంభించి హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేశారన్నారు. ఇప్పుడు ఆరెస్సెస్‌కు సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.

ఆరెస్సెస్ ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు ప్రపంచంలోనే ఏ ఇతర సంస్థలు వారి వారి దేశాల్లో ఎదుర్కొనలేదన్నారు. స్వయంసేవక సంఘ్ మాత్రం భారత దేశంలోనే అన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొందన్నారు.

English summary
RSS chief Mohan Bhagwat has said that India is a "Hindu Rashtra" and there is a need to organize all Hindus in the country for which this is "favourable time".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X