వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమారం: ‘దేశం విడిచి వెళ్లిపోదామన్న’ అమీర్ ఖాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ నిరసన చేపడుతున్న మేధావులకు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ ఖాన్‌ మద్దతు పలికారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు అసహనంపై వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు అమీర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Intolerance: After SRK, Salman, Aamir Khan too breaks silence, gets slammed; here's why

వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆందోళనకు గురైనట్లు ఆయన చెప్పారు. తన భార్య కిరణ్‌ రావ్‌.. దేశం వదిలివెళ్లిపోదామని సూచించినట్లు ఆయన వెల్లడించారు. అవార్డులను వెనక్కు ఇచ్చేస్తున్న ప్రముఖులను ఆయన వెనకేసుకొచ్చారు.

అసమ్మతి, అసంతృప్తిని బయటపెట్టేందుకు సృజనశీలులకు ఇదొక మార్గమని వ్యాఖ్యానించారు.ఢిల్లీలోని రామ్‌నాథ్‌ గోయెంకా ఎక్సెలెన్స్‌ అవార్డు ప్రధాన కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి జైట్లీ కూడా హాజరయ్యారు.

Intolerance: After SRK, Salman, Aamir Khan too breaks silence, gets slammed; here's why

‘రోజూ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో పత్రికలు చూస్తుంటే తెలుస్తోంది. ఓ వ్యక్తిగా, దేశ పౌరుడిగా నాకు ఆందోళన కలుగుతోంది. చాలా సంఘటనలు నన్ను కలవరపాటుకు గురిచేశాయి'అని అమీర్ ఖాన్ చెప్పారు.

కాగా, అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై పలువురు బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నటుడు, ఢిల్లీ బిజెపి ఎంపి మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు. అమీర్‌కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్వీట్ చేశారు.

ఇక్కడ జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు. ఎంత పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని అమీర్‌కు ఆయన సూచన చేశారు.

అమీర్ ప్రకటన షాక్‌కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. అయినా తనలాంటి అభిమానులు అమీర్ పై కురిపించిన ప్రేమ,ఆప్యాయతలు ఇక ముందు కూడా కొనసాగాలంటూ మనోజ్ తివారీ ఆకాంక్షించారు.

Intolerance: After SRK, Salman, Aamir Khan too breaks silence, gets slammed; here's why

కాగా, బాలీవుడ్ నటులు, బిజెపి నేతలైన పరేశ్ రావల్, అనుపంఖర్‌లు కూడా అమీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నిన్ను అమీర్ ఖాన్‌ను చేసిన ఈ దేశంపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం' అని అనుపంఖేర్ అన్నారు. ఇంక్రిడబుల్ ఇండియా ఆరు నెలల్లోనే ఇంటోలరెన్స్ ఇండియా అయిపోయిందా? అని ప్రశ్నించారు.

దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువులు వారి సంప్రదాయాలను, పండగలను, వ్రతాలను ఆచరించాలని మీపైనా బలవంతంగా ఏమైనా రుద్దుతున్నారా? అని నిలదీశారు. మీరొక్కరే వెళ్లిపోతారా? మిగితా 2మిలియన్ల మంది భారతీయులకు ఏం సూచిస్తారని ప్రశ్నించారు. అమీర్ లాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం, దేశంలో మార్పు వచ్చేలా చూడాలని పరేశ్ రావల్ కోరారు.

English summary
Just a day after his controversial interview, Bollywood actor Aamir Khan faced criticism and this time he was slammed by his colleagues in Bollywood. Bollywood actor Anupam Kher and actor-turned-politician Paresh Rawal slammed Aamir who recently in an interview told that he and his wife Kiran Rao had considered of leaving India citing growing "intolerance" in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X