వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీ గ్రేట్, చూసి బుద్ది తెచ్చుకోవాలి: కపిల్ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ సారథి కపిల్ దేవ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం తమ కుర్చీలను అట్టిపెట్టుకుని ఉండే క్రీడా పాలకులు మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టెస్టుల నుండి సరైన సమయంలో ధోనీ తప్పుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.

ఎవరైనా ఆడాలనుకుంటే రెండువందల టెస్టులు కూడా ఆడవచ్చునని చెప్పారు. కానీ ధోనీ మాత్రం అలా చేయలేదన్నారు. తాను చేయగలిగింది చేశా, ఇక తర్వాత తరం ఆడుకోనివ్వండి అంటూ సంకేతాలిస్తూ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడన్నారు. అందుకు తాను ధోనీని అభినందిస్తున్నానని చెప్పారు.

Kapil Dev hails Dhoni's retirement timing

అతనో గొప్ప వ్యక్తి అన్నారు. క్రికెట్‌కు ఎంతో చేశాడన్నారు. ధోనీ కనీసం వందో టేస్టు దాకా ఆడాలని మనమందరం అనుకున్నామని, కాని అతను నూతనంగా ఆలోచించాడన్నారు. జీవితమంతా ఆడుతూనే ఉండాలని ఎవరు అనుకోకూడదన్నారు.

తర్వాత తరం వస్తుందని తెలిశాక రిటైరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కపిల్.. గ్రెగ్ చాపెల్ చేసిన ఓ మాట చెప్పారు. 'ఓ ఆటగాడు తన సమయం దాటిపోయాక కూడా కొనసాగితే.. తర్వాత మూడు తరాలకు నష్టం చేకూర్చినట్లే' అని చాపెల్ అన్నాడన్నారు. ఈ మాటను తాను గౌరవిస్తానని చెప్పారు. క్రికెట్ పాలకులు కూడా 30 ఏళ్లు లేదా జీవితాంతం కుర్చీలకు అతుక్కోవద్దని, ధోనీని చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు.

English summary
Saluting his decision to retire from Test cricket, former India captain Kapil Dev on Tuesday said Mahendra Singh Dhoni has given everybody, including the chair-greedy administrators, a food for thought with his bold step.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X