వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కప్ గెల్చినా కుదరదు: ధోనీ ఆనందానికి అంపైర్ అడ్డు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అడిలైడ్: ప్రతిష్టాత్మక మ్యాచ్‌లలో భారత్ గెలిచినప్పుడు స్టంప్స్ తీసుకొని సంబరాలు చేసుకోవడం టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి అలవాటు. అయితే, ఈసారి ఐసీసీ ప్రపంచకప్ 2015లో ధోనీ ఆ సంబరానికి దూరంగానే ఉండాల్సి వస్తోంది. అతను ప్రపంచకప్ గెలిచినా.. తనకు ఇష్టమైన స్టంప్స్ తీసుకుని ఆనందించే అవకాశం ఈసారి లేకుండాపోయింది.

అతను చేతులు ఊపుకుంటూ మైదానం వీడాలి. అందుకు కారణం ఉంది. ఈ టోర్నీలో వాడుతున్న మూడు స్టంప్స్ ధర అక్షరాల రూ.24 లక్షలు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఎల్ఈడీ స్టంప్స్‌ను ఆటగాళ్లు తీసుకు వెళ్లడం కుదరదని ఐసీసీ స్పష్టం చేసింది.

MS Dhoni Fails to Collect 'Souvenir' Stump After Pakistan Victory

ఆదివారం దాయాది పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ గెలిచిన తర్వాత కనీసం బెయిల్ అయినా తీసుకుందామని ధోనీ చూశాడు. అయితే, అంపైర్ అందుకు ససేమీరా అన్నాడు. ధోనీ బెయిల్ తీసేందుకు ప్రయత్నించగానే... అంపైర్ ఇయాన్ గౌల్డ్ అడ్డుపడి.. ధోనీతో ఏదో మాట్లాడటం టీవీలో కనిపించింది. అనంతరం బెయిల్‌ను ధోనీ యథాస్థానంలో ఉంచాడు. ఆ బెయిల్స్ ధర ఐఫోన్ ధరకు సమానమంట.

English summary
The 'LED stumps' were first used during the 2013 edition of 'Big Bash' after which they were used on an experimental basis at the World T20 in Bangladesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X