వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలోకి వస్తే ముఖ్యమంత్రి!: రేవంత్ రెడ్డికి భారీఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొడంగల్ యువ ఎమ్మెల్యే, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత, కేంద్రమంత్రి భారీ ఆఫర్ ఇచ్చారా? అంటే అవుననే చెబుతున్నారు. రేవంత్ బిజెపిలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఓ కేంద్రమంత్రి ప్రతిపాదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం కేంద్రమంత్రి హన్సరాజ్ గంగారామ్ అహిర్ వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. రేవంత్ వాక్చాతుర్యానికి సదరు కేంద్రమంత్రి ముగ్దులయ్యారట. దీంతో, అతని వద్దకు వెళ్లి అభినందించారు.

Revanth Reddy says 'NO' to BJP leader

ఇదే సమయంలో సదరు కేంద్రమంత్రి రేవంత్ రెడ్డికి మంచి ఆఫర్ ఇచ్చారట. మీరు బిజెపిలో చేరితే, మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని చెప్పాట. అయితే, తాను తెలుగుదేశం పార్టీలో సంతోషంగా ఉన్నానని, తనకు అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు మంచి అవకాశాలు కల్పించాలని చెప్పి.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారట.

టిడిపిలో రేవంత్ రెడ్డి కీలక నేతగా ఉన్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ పైన రేవంత్ రెడ్డి ఊగిపోతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డారు. అనంతరం ఇటీవలే టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు.

English summary
It is said that Telangana TDP leader Revanth Reddy was rejected BJP leaders offer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X