వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ రాణి మరణించారంటూ బీబీసీ ఉద్యోగి ట్వీట్..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మృతి చెందారంటూ బుధవారం బీబీసీ ఉద్యోగి ఒకరు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌లో హాల్ చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన బీసీసీ సంస్ధ
ఆ ట్వీట్‌ను తొలగించి, క్షమాపణలు కోరింది.

అంతేకాదు ఆ తప్పిదం ఎలా జరిగిందో కూడా వివరణ ఇచ్చుకుంది. రాజకుటుంబంలో ఎవరైనా మరణిస్తే అప్రమత్తంగా ఉండాలన్న శిక్షణ కార్యక్రమంలో అభ్యాసన జరుగుతుండగా పొరపాటున ఆ ఉద్యోగి ట్విట్టర్ హ్యాండ్లర్ నుంచి ఒక ట్వీట్ బహిర్గతమైందని తెలిపింది. బీబీసీ ఆ ఉద్యోగిపై అంతర్గత విచారణకు ఆదేశించింది.

Rogue BBC tweet sparks global news alert about Queen's health

వాస్తవానికి క్వీన్ ఎలిజబెత్ 2 సంవత్సర వైద్యపరీక్షల్లో భాగంగా బుధవారం లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ VII ఆసుపత్రికి వచ్చి వెళ్లారు. ట్విట్టర్‌లో క్వీన్ ఎలిజబెత్‌పై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, 89 ఏళ్ల రాణి ఆరోగ్యంగానే ఉన్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు ప్రకటించారు.

బీబీసీ ఉర్దూలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమీన్ ఖవాజా అనే మహిళా జర్నటిస్టు ఈ ట్వీట్ చేసింది. తన తొలి ట్వీట్‌లో క్వీన్ ఎలిజబెత్ 2 మరణించారని ట్వీట్ చేయగా... ఆ తర్వాత క్వీన్ ఆసుపత్రిలో చేరారని ట్వీట్ చేసింది.

English summary
A rogue tweet by a BBC reporter after an obituary rehearsal led several major international news organisations to wrongly report that Queen Elizabeth had been admitted to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X