వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికెట్లను తాకిన బంతి: పాక్ కెప్టెన్ మిస్బా నాటౌట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా అడిలైడ్‌లో ఆస్టేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్ధాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్టేలియా బౌలర్ హెజిల్ వుడ్ వేసిన 5.3 ఓవర్‌లో బంతి వికెట్లను తాకింది. వికెట్లకు ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వెలగడంతో ఆస్టేలియా ఆటగాళ్లు అవుట్ కోసం అప్పీలు చేశారు. బేల్స్ కింద పడకపోవడంతో అంఫైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.

దీంతో పాకిస్ధాన్ కెప్టెన్ మిస్బాఉల్ హక్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం బంతి వికెట్లను తాకిన బేల్స్ కింద పడకపోతే ఆ బ్యాట్స్‌మెన్‌ను నాటౌట్‌గా పరిగణిస్తారు. పాక్ కెప్టెన్ మిస్బావుల్ హక్‌ విషయంలో ఇదే జరిగింది. దీంతో ఆస్టేలియా ఆటగాళ్లు ఒకింత సహనానికి గురయ్యారు.

World Cup, 3rd Quarter-final Live: Aussies Snatch Advantage as Misbah, Haris Fall

ఆ తర్వాత మ్యాచ్‌లో మిస్బావుల్ హక్‌ను ఆసీస్ బౌలర్ మాక్స్‌వెల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో పాకిస్ధాన్ మూడో వికెట్ కోల్పోయింది. మాక్స్‌వెల్ వేసిన బంతిని భారీ షాట్‌ను ఆడే ప్రయత్నంలో డీప్ మి్డ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఫించ్ క్యాచ్ అందుకున్నాడు.

వరల్డ్ కప్‌లో మూడో క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్టేలియా Vs పాకిస్ధాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్ధాన్ జట్టు నిలకడగా ఆడుతుంది. పాక్ బ్యాట్స్‌మెన్లపై ఆస్టేలియా బౌలర్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్ధాన్ షెహజద్ (5), సర్ఫరాజ్ (10), మిస్బావుల్ హక్ (34), సోహైల్ (41), అక్మల్ (20), అఫ్రిది (23) వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ నడిపించే భారం పాక్ టెయిలెండర్లపై పడింది.

English summary
Misbah put on 73 with Haris Sohail but their wickets at a key stage shifted the momentum in favour of Australia.Veteran Shahid Afridi too fails to do anything more than just throw his wicket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X