తీగ లాగితే డొంక: డ్రగ్ రాకెట్లో ప్రముఖుడు?
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదులుతోంది. డ్రగ్ రాకెట్ వ్య.వహారంతో హైదరాబాదు నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి పాత్ర ఉందని, అతనికి ముంబై స్మగ్లర్లతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ ప్రముఖ వ్యక్తి వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ సమీపంలోని ఆటోనగర్ వద్ద హోటల్లో 50 కిలోల ఎపిడ్రిన్ పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఎపిడ్రిన్ అక్రమ రవాణా, సరఫరాపై కీలకమైన వివరాలు సేకరించినట్టు పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోదాలు జరిపే యోచనలో ఉన్నారు.
Also Read: మహిళ పొట్టలోంచి 51 డ్రగ్స్ ప్యాకెట్లను తీసిన వైద్యులు
సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరపాలని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో కీలకమైన వ్యక్తికి సంబంధించిన వివరాలు రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. మరోవైపు నార్కోటిక్స్ విభాగం నుంచి రంగంలోకి దిగిన అధికారులు ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: పొట్టలో డ్రగ్స్ దాచుకున్న మహిళ మూసా వెనక శశికళ?

నిరుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ ప్యాకెట్లు కడుపులో దాచుకున్న దక్షిణాఫ్రికాకు చెందిన మూసా అనే మహిళను గుర్తించారు. 1.99 కిలోల మాదకద్రవాల్యను వెలికితీసేందుకు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు తీవ్రమైన ఇక్కట్లు పడిన విషయం తెలిసిందే. గత నెలలో బీటెక్ స్టూడెంట్స్‌కు కొందరు ఎల్ఎస్డీ డ్రగ్స్‌ను విక్రయిస్తూ తప్పించుకున్నారు. ఇప్పుడు ఏకంగా 50 కిలోల ఎపిడ్రిన్‌ను నగరంలోకి చేర్చారు.
మరో 50 కిలోలు చెన్నైకి తరలించే ప్రయత్నంలో డీఆర్ఐ అధికారులకు చిక్కారు. విదేశీ మహిళ కడుపులో దాచుకుని తీసుకొచ్చిన మాదకద్రవ్యాలను ఆ ప్రముఖుడికి అందజేసేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ తరలింపులో నైజీరియన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.