వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధోనీకి రూ.20 కోట్లు టోపీ పెట్టిన ఆస్ట్రేలియా కంపెనీ

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఓ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కంపెనీ రూ.20 కోట్ల మేర మోసం చేసింది. ధోనీ పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఎండార్సుమెంట్లతో అతను కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన 'స్పార్టాన్ స్పోర్ట్స్' సంస్థ ధోనీని మోసం చేసింది. ఒప్పందాలను గౌరవించకుండా రూ.20 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది. వివిధ రకాల క్రీడా పరికరాలను తయారు చేసే ఆ కంపెనీ ధోనీతో మూడేళ్ల పాటు బ్యాట్, స్పాన్సర్ షిప్ కింద రూ.13 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.

Australian sporting gear company Spartan dupes Dhoni of Rs 20 crore

కానీ చెల్లింపులు చేయడంలో విఫలమైంది. రాయల్టీ తదితరాలు కలుపుకొని ఇవ్వాల్సిన సొమ్ము రూ.20 కోట్లకు చేరింది. ఈ ఒప్పందం 2013 డిసెంబర్‌లో జరిగింది. అయితే, ధోనీకి నాలుగుసార్లు మాత్రమే చెల్లింపులు చేశారని.. ఆయన వ్యవహారాలు చూసే రితీ స్పోర్ట్స్ తెలిపింది. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో చెల్లింపులు జరిపిందన్నారు. బకాయిల ఎగవేత పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది.

English summary
India's limited overs captain Mahendra Singh Dhoni, who remains a sought after personality in the endorsement world despite his retirement from Tests, has been allegedly duped by one of the many brands he endorses -- Spartan Sports -- of over Rs 20 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X