వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబా: దూసుకొచ్చి, భక్తుల ముందే బాబాల ఫైట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంచి, మానవత్వం, ఆధ్యాత్మికం అంశాలను బోధించాల్సిన ఇద్దరు స్వాములు శివాలెత్తారు. భక్తుల మధ్యే వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంఘటన జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిను అదుపులోకి తెచ్చారు.

షిర్డీ సాయిబాబానే అవమానిస్తారా అని, ఒకరు ఆదిశంకరాచార్యులను అవమానిస్తారా అని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఆ ఇద్దరు స్వాముల్లో ఒకరు శ్రీరమణానంద మహర్షి. మరొకరు స్వర్ణ హంపి పీఠాధిపతి గోవిందానంద స్వామి.

ఎన్టీఆర్ స్టేడియంలో రమణానంద మహర్షి.. తాను షిర్డీ సాయిబాబా దేవుడు అని నిరూపిస్తానని వ్యాఖ్యానించారు. సాయిబాబా దేవుడు కాదంటూ గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన అమాయకత్వానికి నిదర్శనమన్నారు. షిర్డి సాయిబాబా గురించి ఆ స్వామిజీకేమీ తెలియదని, అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు.

వంద ప్రమాణాలతో సాయిబాబా దేవుడని తాను నిరూపిస్తానని, ఒక్క ప్రమాణంతో ఆయన దేవుడు కాదని స్వామి స్వరూపానందేంద్ర నిరూపించగల్గుతారా? అన్నరాు. ఈ వాదనలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గెలిస్తే తన మహా పీఠాన్ని ఆయనకు ఇస్తానని, ఒకవేళ ఆయన ఓడిపోతే ద్వారకా పీఠాన్ని తనకు ఇవ్వాలన్నారు.

అంతకుముందు ఆయన 'నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా?' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సభకు హాజరైన భక్తులకు ఈ పుస్తకాలను ఉచితంగా పంచిపెట్టారు. కలియుగం ప్రారంభమైన తర్వాత అయిదువేల సంవత్సరాల తర్వాత ఒక మహితాత్ముడు అవతరిస్తాడని గ్రంథాల్లో ఉందని, ఆ మహితాత్ముడెవరో కాదని, సాయిబాబాయేనని అన్నారు.

ఈ సందర్భంగా మెహెర్ బాబా, రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ములు షిర్డి సాయిబాబా జగద్గురువులు అని ప్రస్తావించిన సంఘటనలను రమణానంద మహర్షి గుర్తు చేశారు.

ఇదే సమయంలో సభాస్థలి వద్దకు గోవిందానంద సరస్వతి కారులో వచ్చారు. రమణానంద మహర్షి పైన మండిపడ్డారు. ఇక్కడి సభా వేదికపై షిర్డి సాయిబాబా విగ్రహం పక్కన, ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని పెట్టడం సబబు కాదని, సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఉందన్నారు.

సాయిబాబా దేవుడు కాదనేవారు తనతో వాదనకు రావాలంటున్న రమణానంద మహర్షి ఆ మాటపై నిలబడటం లేదన్నారు. రమణానంద మహర్షితో వాదనకు తాను సిద్ధంగా ఉన్నానని, వాదనకు దిగాలంటూ గోవిందానంద పట్టుబట్టారు. అయితే, రమణానంద ఇక్కడ వాదోపవాదనలకు ఆస్కారం లేదన్నారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆయనకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇదంతా సుమారు గంటపాటు జరిగింది.

 బాబాల ఫైట్

బాబాల ఫైట్

షిర్డీ సాయిని అవమానిస్తున్నారంటూ ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకరు, ఆది శంకరాచార్యనే అవమానిస్తారా అంటూ మరొకరు.. ఇద్దరు బాబాలు బహిరంగంగా బాహాబాహీకి సిద్ధపడ్డారు. వారివారి అనుచరులూ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

 బాబాల ఫైట్

బాబాల ఫైట్

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన స్వర్ణ హంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి సరిగ్గా సభ జరిగే సమయానికి స్టేడియం వద్దకు చేరుకున్నారు. సిద్ధగురు రమణానంద సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

బాబాల ఫైట్

బాబాల ఫైట్


వేదికపై షిర్డీ సాయిబాబాతోపాటు ఆదిశంకరాచార్యులవారికి పూజ చేసి శంకరాచార్యులవారిని అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరు స్వాముల భక్తులూ వాగ్వాదానికి దిగారు. హంపిస్వామి చర్చలో పాల్గొనేందుకు వేదికపైకి వెళ్తుండగా పోలీసులు ఆయన్ను ఆపేశారు.

బాబాల ఫైట్

బాబాల ఫైట్

ఇద్దరు స్వామీజీలకూ నచ్చజెప్పారు. సభను అడ్డుకోవడం తగదని.. రమణానంద చర్చకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గురువారం ఓ చానల్‌లో జరిగే చర్చలో పాల్గొనాలని గోవిందానంద సరస్వతికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో ఉద్రిక్త వాతావరణం కాస్త సద్దుమణిగింది.

బాబాల ఫైట్

బాబాల ఫైట్

ఆ తర్వాత,. రమణానంద మహర్షి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. సాయినాథుడు సర్వశక్తిమంతుడని, ఆయనను దేవుడు కాదంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. సాయిబాబాపై 24 అనుచిత ఆరోపణలు చేసిన ద్వారక పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి.. ఒక పీఠాధిపతిని విమర్శించాల్సిన దుస్థితి కల్పించారన్నారు.

 బాబాల ఫైట్

బాబాల ఫైట్

ఎన్ని ఆరోపణలు చేసినా తనను ఎవరూ ప్రశ్నించట్లేదనుకుంటున్న స్వరూపానంద సరస్వతి హైదరాబాద్‌కు వస్తే తెలుస్తుందన్నారు. సాయినాథుడు దేవుడు కాదన్న ఆయనను మూర్ఖుడు అంటేనే గోవిందానంద సరస్వతి సభను అడ్డుకోవడానికి వచ్చారని, మరి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తామంటే తాము ఎట్ల సహిస్తామన్నారు.

English summary
BaBas fighting in NTR stadium on Wednesday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X