వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో వింత: కళ్లు లేని శిశువు జననం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: తనకు జన్మించిన శిశువుని చూసి ఓ కన్న తల్లి ఆందోళనకు లోనైన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఆమె అంతలా ఆందోళన చెందడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా? తనకు జన్మించిన శిశువుకు కళ్లు లేకపోవడమే. చైనా మీడియా కూడా ఈ సంఘటనపై పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి.

వివరాల్లోకి వెళితే... ఈ నెల 20న చైనాలోని గాంగ్జౌ ప్రాంతానికి చెందిన లీ పెయ్‌హువా పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చింది. అయితే ఆ శిశువుకు కళ్లు లేవు. వెంటనే ఆ శిశువుని గాంగ్జౌ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులకు చూపించింది. ప్రతి పది వేల మందిలో 30 మంది మాత్రమే ఇలా జన్మిస్తారని వైద్యులు తెలిపారు.

Baby Born Without Eyes Despite Mom's Normal Pregnancy

అనోఫ్తాల్మియా అనే అవలక్షణాల వల్లే ఇలా జరుగుతుందని చికిత్స అనంతరం వైద్యులు తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుంచి అన్ని పరీక్షలు చేయించుకున్నామని, ఎలాంటి లోపాలు కనిపించలేదని లీ పెయ్‌హువా కుటుంబ సభ్యులు తెలిపారు. అసలు ఇలా ఎలా ఎందుకు జరిగిందో తమకు అర్థంకావడం లేదని వాపోయారు.

Baby Born Without Eyes Despite Mom's Normal Pregnancy

గర్భధారణ సమయంలో తీసే ఆల్ట్రాసౌండ్ లేదా ఇతర టెస్టుల్లో ఈ అనోఫ్తాల్మియా లక్షణాలు తెలియవని వైద్యులు పేర్కొన్నారు. దీంతో పాటు మరేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో శిశువుకు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు.

English summary
A woman in Guangzhou, China, was devastated to find her son was born with an eye condition which means he has little or no eye tissue. The condition Anophthalmia affects one in every 100,000 children, according to NHS, and it means that the boy will never be able to see.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X