వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూరి ఉగ్రదాడి: జవాన్ ఫ్యామిలీని అవమానించిన బీజేపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

లక్నో: బీజేపీ ఎంపీ ఒకరు యూరి ఉగ్రదాడి ఘటనలో అసువులు బాసిన అమరజవాను కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించారు. దీంతో అతని పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరజవాను కుటుంబ సభ్యులు కూడా అతని తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

కాశ్మీర్‌‌లోని యూరీ సెక్టార్ పై జరిగన ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన జవాన్ గణేశ్‌ శంకర్‌ యాదవ్‌ ప్రాణాలు కోల్పోయారు. దీంతో గణేశ్‌ మృతదేహానికి ఆయన స్వగ్రామమైన గురాపలిలో సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి.

దీనికి హాజరైన బీజేపీ ఎంపీ శరద్‌ త్రిపాఠి వీరజవాను మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... గణేశ్‌ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగని ఆయన ఎవరికి తోచినంత సాయం వారు చేయాలన్నారు. దీంతో పలువురు డబ్బులిచ్చేందుకు ముందుకొచ్చారు.

BJP MP appeals for donation for martyr's family, kin disapprove

అప్పటికే పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమరజవాను కుటుంబ సభ్యులను ఇది తీవ్రంగా బాధించింది. దీనిని అవమానంగా భావించిన అమర జవాను భార్య గడియా.. తామేమీ బిచ్చగాళ్లం కాదని మండిపడ్డారు. సైనిక లాంఛనాలు, ఇతర సౌకర్యాలు ఉన్నాయని, తమను ఇలా అవమానించవద్దన్నారు.

వారి ఆవేదన, ఆగ్రహంతో సదరు ఎంపీ తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి నిష్క్రమించారు. సదరు ఎంపీ తీరు పైన చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా సాయం చేయాల్సిన అతను అక్కడున్న వారి నుంచి విరాళాలు వసూలు చేయడం అమరజవాన్‌ను అవమానించడమే అన్నారు. ఆ తర్వాత ఎంపీ మాట్లాడుతూ.. ఆ కుటుంబాన్ని అవమానించడం తన ఉద్దేశం కాదని, వారికి సాయం చేయాలని మాత్రమే చూశానన్నారు.

English summary
The family of Ganesh Shankar Yadav, who was martyred in the Uri terror attack, said they felt “humiliated” by BJP MP Sharad Tripathi’s appeal at the funeral to collect donations from the public to help them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X