వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేశ్య ఎఫెక్ట్: 'నా మైనర్ కూతుర్ని వేధిస్తున్నారు'

|
Google Oneindia TeluguNews

లక్నో: బీఎస్పీ అధ్యక్షురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దయాశంకర్ సింగ్‌ను బీజేపీ రెండు రోజుల క్రితం సస్పెండ్ చేసింది. ఈ ఘటన పైన దయాశంకర్ సింగ్ భార్య స్వాతి శుక్రవారం నాడు ట్విస్ట్ ఇచ్చారు.

తన మైనర్ కూతురును బీఎస్పీ నేతలు వేధిస్తున్నారని, ఇందుకు గాను తాను మాయావతి పైన కేసు పెడతానని ఆమె చెప్పారు. తమ కుటుంబాన్ని బీఎస్పీ కార్యకర్తలు, నాయకులు వేధించడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

'మాయావతి వేశ్య కంటే హీనం': బీజేపీ నేత, పార్టీలో కుదుపు 'మాయావతి వేశ్య కంటే హీనం': బీజేపీ నేత, పార్టీలో కుదుపు

BSP 'abusing' my daughter, will file FIR against Mayawati: Dayashankar’s wife

తన భర్తను అన్ని పార్టీ పోస్టుల నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, తన భర్తను తొలగించారని, అయినప్పటికీ మాయావతికి ఇంకా సంతృప్తి లేదని మండిపడ్డారు.

తమను వేధించాలని బీఎస్పీ కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారన్నారు. తన కూతురును వేధించాలని చెప్పడం విడ్డూరమన్నారు. తన కుటుంబానికి తన కూతురుకు ఏమైనా జరిగితే మాయావతియే బాధ్యత వహించాలని ఆమె అన్నారు.

తాను చేసిన వ్యాఖ్యలకు తన భర్త క్షమాపణ కూడా చప్పారని, అయినప్పటికీ ఆమె తగ్గడం లేదని, తన భర్త తల తీసేయాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వేధిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

English summary
Expelled BJP leader Dayashankar Singh’s wife Swati on Friday alleged that she and her minor daughter were being threatened and harassed by Bahujan Samaj Party (BSP) activists and said she would lodge an FIR against party chief Mayawati for the 'mental trauma' her family was being subjected to.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X