వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గేల్ రికార్డు షో: 11 సిక్సర్లు బాదేసిడిలా

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌ మరోసారి తన ఆటతీరుతో అభిమానులను ఉర్రూతలూగించాడు. పవర్‌ ఫుల్‌ షాట్లతో ఇంగ్లాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ టీ20 వరల్డ్‌కప్‌లో తొలి ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు.

భారీ లక్ష్యం ముందున్నా.. తడబాటుకు తావివ్వకుండా.. చెలరేగిపోయాడు గేల్. ఒకటా.. రెండా ఏకంగా 11 సిక్సర్లు బాదేశాడు. మరోసారి తానేంత విధ్వంసకర బ్యాట్స్‌మన్ అనేది నిరూపించుకున్నాడు గేల్. టీ-20 ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ, ఓవరాల్‌గా మూడో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.

గేల్ విధ్వంసంతో బుధవారం ఇంగ్లాండ్ జట్టు జరిగిన టీ-20 మ్యాచులో వెస్టిండీస్‌ అద్భుత విజయం సాధించింది. క్రిస్‌ గేల్‌ (48 బంతు ల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 నాటౌట్‌) మెరుపు శతకంతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన గ్రూప్‌-1 మ్యాచ్‌లో విండీస్‌ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది.

Chris Gayle attributes 100 off 48 balls to strenuous practice

ఇంగ్లండ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్‌ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించింది.

గేల్ సూపర్ సిక్సర్ల షో

ఛేదనలో రెండో బంతికే ఓపెనర్‌ చార్లెస్‌ను అవుట్‌ చేసిన ఇంగ్లాండ్ బౌలర్ విల్లే.. విండీస్‌ను తొలి దెబ్బకొట్టాడు. అయితే రెండో ఓవర్లో ఫోర్‌, సిక్సర్‌తో గేల్‌ ప్రత్యర్థికి హెచ్చరికలు పంపాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శామ్యూల్స్‌ బౌండ్రీల మీద బౌండ్రీలు సాధించాడు. అయితే ఏడో ఓవర్లో శామ్యూల్స్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు.

కానీ, ఈ ఆనందం వారికి ఎంతో సేపు నిలువలేదు. రషీద్‌ తర్వాతి ఓవర్లో వరుసగా 2 సిక్సర్లతో గేల్‌ జోరందుకున్నాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లోనూ మరో రెండు సిక్సర్లు రాబట్టాడు. అయితే 12వ ఓవర్లో రామ్‌దిన్‌ (12)ను మొయిన్‌ అలీ అవుట్‌ చేయగా, అదే ఓవర్‌లో సింగిల్‌ తీసిన గేల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

తర్వాతి ఓవర్లో డ్వేన్‌ బ్రావో (2)ను అవుట్‌ చేసిన టాప్లే విండీ్‌సపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశా డు. కానీ, గేల్‌ మరింత రెచ్చిపోయాడు. అలీ వేసిన 14వ ఓవర్‌ చివరి మూడు బంతులనూ సిక్సర్లుగా మలిచి స్టేడియాన్ని హోరెత్తించాడు. విల్లే వేసిన 16 ఓవర్లో వరుసగా 4, 6, 6తో విజృంభించాడు.

శతకానికి ముందు కాస్త నెమ్మదించిన గేల్‌ 18వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌ తీసి శతకం (47 బంతుల్లోనే) పూర్తి చేసుకున్నాడు. తర్వాతి ఓవర్లో రస్సెల్‌ (16 నాటౌట్‌) విన్నింగ్‌ షాట్‌ ఆడాడు.

English summary
Swashbuckling West Indian batsman Chris Gayle, whose unbeaten hundred today helped his side thrash England in a World T20 cricket match, attributed his sensational knock to strenuous practice and preparation in the run-up to the ICC event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X