వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నకరాల్ చేస్తే జైలులో పెట్టిస్తా, నేనే వచ్చి కూల్చేస్తా!'

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిఆర్ఎస్ నేత వేణుగోపాల చారి మోడల్ మార్కెట్‌ను అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి. తాను నిర్మించ తలపెట్టిన మోడల్ మార్కెట్‌ను తెరాస నేత వేణుగోపాల చారి అడ్డుకుంటున్నారని ఓ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని పేర్కొంది.

ఓ కాంట్రాక్టర్ ఏఎస్ రావు నగర్లో కొత్తగా మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. అయితే తాను చేపట్టిన పని ముందుకు సాగడం లేదని, మార్కెట్ నిర్మాణాన్ని ఆపాల్సిందేనని అధికార పార్టీ నేత వేణుగోపాల చారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని సదరు కాంట్రాక్టర్ వాపోతున్నారని పేర్కొంది.

Contractor alleges TRS leader threatening him

పనులు ఆపకుంటే నేనే స్వయంగా వచ్చి కూల్చివేస్తానని వేణుగోపాల చారి తీవ్రంగా హెచ్చరిస్తున్నారని, నకరాల్ చేస్తే జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తున్నారని, ఎందుకని అడిగితే కోర్టుకెళ్లి తేల్చుకోమంటున్నారని సదరు కాంట్రాక్టర్ చెబుతున్నారని చెప్పింది.

English summary
Contractor alleges TRS leader threatening him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X