వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్ హెచ్చరిక, జయప్రదకు కేబినెట్ హోదా పదవి

|
Google Oneindia TeluguNews

లక్నో: ములాయం సింగ్ యాదవ్‌తో అమర్ సింగ్ మళ్లీ జత కలిసిన నేపథ్యంలో ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా పదవిని ఇచ్చింది. చాలా ఏళ్ల పాటు అమర్ సింగ్ సమాజ్ వాది పార్టీకి దూరంగా ఉన్నారు.

యూపీలో మారుతున్న సమీకరణం: జయప్రద డైలమాకు పుల్‌స్టాప్!యూపీలో మారుతున్న సమీకరణం: జయప్రద డైలమాకు పుల్‌స్టాప్!

కొద్ది రోజుల క్రితం ఆయన తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరారు. ములాయం సింగ్ మళ్లీ ఆయనను దరి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్‌కు రాజకీయంగా బాగా స్నేహితురాలైన జయప్రదకు కేబినెట్ ర్యాంకు పదవి లభించింది.

Days after Amar Singh's tantrum, Jaya Prada gets plum spot in film council

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం.. యూపీ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సెల్ సీనియర్ డిప్యూటీ చైర్ పర్సన్‌గా జయప్రదను నియమించారు.

పార్టీలో తనకు, తన సన్నిహితురాలు జయప్రదకు అవమానం జరుగుతోందని, పార్టీ నుంచి వైదొలుగుతామని ఇటీవల అమర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు పదవి రావడం గమనార్హం.

యూపీ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఇటీవల కవి గోపాల్ దాస్ నీరజ్‌ను నియమించారు. ఇప్పుడు జయప్రదకు డిప్యూటీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. జయప్రద గతంలో యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున ఎంపీగా ఉన్నారు. 2010లో అమర్ సింగ్‌తో పాటు పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.

English summary
Days after Amar Singh, who was recently reinducted into SP and elected to Rajya Sabha, accused some party leaders of “humiliating” him and former SP MP Jaya Prada, the Akhilesh government has appointed the actress-turned-politician as senior deputy chairperson of the Uttar Pradesh Film Development Council. Sources also said that she is likely to get a ministerial rank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X