వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు కొమ్ములు, హిట్లర్ పోలిక!: ఇది ‘టైమ్’ అవమానమే?

టైమ్ మేగజైన ప్రచురించిన ట్రంప్ ఫొటోపై తాజాగా ట్విట్టర్‌లో కొత్త చర్చ నడుస్తోంది. కవర్‌ ఫొటోపై ట్రంప్‌ను అవమానించే రీతిలో టైమ్‌ సంపాదకులు తీర్చిదిద్దారని వారు ఆరోపిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రముఖ వార్తా సంస్థ టైమ్‌ మేగజైన్‌ 'ఈ ఏడాది మేటి వ్యక్తి(పర్సన్ ఆఫ్ ది ఇయర్)'గా ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంచలన విజయం సాధించినందుకు గానూ ఆయన్ను ఎంపిక చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

కాగా, టైమ్ మేగజైన ప్రచురించిన ట్రంప్ ఫొటోపై తాజాగా ట్విట్టర్‌లో కొత్త చర్చ నడుస్తోంది. కవర్‌ ఫొటోపై ట్రంప్‌ను అవమానించే రీతిలో టైమ్‌ సంపాదకులు తీర్చిదిద్దారని వారు ఆరోపిస్తున్నారు. టైమ్‌ పేరులోని 'ఎం' అక్షరం మధ్యలో ట్రంప్‌ తల రావడంతో ఎం అక్షరం ఆయనకు కొమ్ములు వచ్చినట్లుగా కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో వారు మండిపడుతున్నారు.

అంతేగాక, విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు' గా అభివర్ణిస్తూ కవర్‌ ఫొటో టైమ్‌ ప్రచురించడంతో వారి వాదనలకు మరింత బలం చేకూరింది. మరోవ్యక్తి ఏకంగా నియంత హిట్లర్‌తో పోలుస్తూ ట్రంప్‌ చిత్రాన్ని ఉద్దేశపూర్వకంగానే టైమ్‌ ప్రచురించిందంటూ ట్వీట్‌ చేయడం గమనార్హం.

ఉద్దేశపూర్వకంగా 'టైమ్‌' మేగజైన్ ఈ విధంగా చేసిందో లేదో తెలియదు గానీ ట్విట్టర్‌లో మాత్రం మ్యాగజైన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, విభజించిన అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడు' అని టైమ్‌ ప్రచురించడంపై ట్రంప్‌ కూడా స్పందించారు. తాను దేశం విడిపోయే విధంగా ఏమీ చేయలేదని చెప్పడం సమాధానమిచ్చారు. కాగా, ఈ పోటీలో హిల్లరీకి రెండో స్థానం రాగా.. రీడర్స్‌ పోల్‌లో భారత ప్రధాని మోడీకి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.

English summary
internet wasn’t as shocked about President-elect Donald Trump being named Time’s Person of the Year as they were about the magazine cover that accompanied the announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X