వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను లైన్ వేసేంత అందం వారికి లేదు: ట్రంప్, హిల్లరీపై సంచలనం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రిపబ్లికన్ తరఫున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. తన పైన తాజాగా ఇద్దరు మహిళలు చేసిన ఆరోపణలను కొట్టి పారేశారు. తమతో కూడా ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించడని తాజాగా ఇద్దరు మహిళలు చెప్పారు. వారు చెప్పినవి అవాస్తవాలు అని డొనాల్డ్ ట్రంప్ కొట్టి పారేశారు.

నేను లైన్ వేసేంత అందం లేదు!

నేను లైన్ వేసేంత అందం లేదు!

వారి ఆరోపణలను ఖండించిన ట్రంప్.. ఆ మహిళలు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అవన్నీ పచ్చి అవాస్తవాలు అని నొక్కి చెప్పారు. అంతేకాదు, తన పైన అయిదుగురు ఆరోపణలు చేశారని, అసలు వారిలో ఇద్దరు తాను కన్నేసేంత అందంగా కూడా లేరని వ్యాఖ్యానించారు.

ట్రంప్ పైన మహిళల విమర్శలు

ట్రంప్ పైన మహిళల విమర్శలు

కాగా, ట్రంప్ రియాల్టీ షో 'ది అప్రెంటీస్' అయిదవ సీజన్‌లో పాల్గొన్న సమర్ జెర్వోస్.. ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆయన్ను మార్గదర్శిగా తాను భావిస్తే, షో తర్వాత టచ్‌లో ఉండమని చెప్పారని, ఛాతీపై చెయ్యి వేశాడని, ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు. వాషింగ్టన్ పోస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మాజీ మోడల్ క్రిస్టినా ఆండర్సన్, తాను మినీస్కర్ట్ ధరించిన సమయంలో ట్రంప్ అసభ్యకరంగా తాకారని ఆరోపించింది.

హిల్లరీపై సంచలన వ్యాఖ్యలు

హిల్లరీపై సంచలన వ్యాఖ్యలు

ట్రంప్ డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిబేట్‌కు ముందు హిల్లరీ క్లింటన్(68) డ్రగ్స్ తీసుకుని వస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే వారం లాస్ వెగాస్‌లో జరగనున్న డిబేట్‌కు ముందు డ్రగ్ పరీక్షలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. అందుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు.

హిల్లరీ పై కామెంట్స్

హిల్లరీ పై కామెంట్స్

గత డిబేట్ సందర్భంగా మొదట ఉత్సాహంగా మాట్లాడిన హిల్లరీ తర్వాత తన కారు దగ్గరకు వెళ్లేందుకు ఎంతో కష్టపడ్డారని అన్నారు. దీంతో ఆమె మాదక ద్రవ్యాలు తీసుకుని డిబేట్‌కు వస్తున్నట్టు అనుమానించాల్సి వస్తోందని, వచ్చే వారం జరగనున్న చివరి డిబేట్‌కు ముందు అధ్యక్ష అభ్యర్థులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించాలన్నారు.

డ్రగ్స్ టెస్ట్ పైన సవాల్

డ్రగ్స్ టెస్ట్ పైన సవాల్

న్యూ హ్యాంప్‌షైర్‌లో తన మద్దతుదారులతో మాట్లాడారు. తాము అథ్లెట్ల వంటి వాళ్లమని, ప్రైమరీల్లో 17 మందిని ఓడించానని, పోటీలో పాల్గొనడానికి ముందు అథ్లెట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారని, డిబేట్‌కు ముందు మేం కూడా చేయించుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

English summary
US presidential hopeful Donald Trump has hit back at sex claims from two women, describing them as "a total set-up".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X