వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబే హీరో, సీఎం అవుతారనుకోలేదు: ప్రాణమిత్రుడు చెప్పిన విశేషాలు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిన్ననాటి నుంచి ఒక మంచి స్నేహితుడున్నాడు. ఆయన గత 55ఏళ్ల నుంచి చంద్రబాబుతో స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు. వారిద్దరూ కలుసుకోవడం అరుదే అయినప్పటికీ.. కలిసినప్పుడు మాత్రం ఇద్దరూ తమ తమ యోగక్షేమాలు ఆరాతీసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆయనే చంద్రబాబు చిన్ననాటి ప్రాణ మిత్రుడు గిరిధర్ రెడ్డి.

వారి స్నేహం వివరాల్లోకి వెళితే.. చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పటినుంచి వీరు స్నేహం కొనసాగుతూ వస్తోంది. ఇంటర్, డిగ్రీలోనూ వీరు కలిసి చదువుకున్నారు. ఎప్పుడూ వీరిద్దరు కలిసే తిరిగేవారు.
వీరిద్దరిలోనూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. తన మిత్రుడు రాష్ట్రానికి సీఎం అయినా ఏనాడూ సాయం కోరలేదు గిరిధర్.

చంద్రబాబులాగా తన సమస్యలను తానే పరిష్కరించుకోగలిగే మనస్థత్వం ఆయనది. అందుకే అంతలా అల్లుకుపోయింది వీరి స్నేహ బంధం. ఇలాంటి లక్షణాలు ఉన్నందుకేనేమో వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది.

గిరిధర్ తిరుపతి సమీపంలోని తొండవాడలో నివాసముంటున్నారు. ఆగస్టు 7న స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. చంద్రబాబు గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు వెల్లడించారు.

చంద్రబాబు కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవారట. చంద్రబాబు హీరో వేషం వేస్తే, ప్రస్తుత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హీరోయిన్ వేషం వేసేవారని గిరిధర్ రెడ్డి చెబుతున్నారు. చిన్ననాటి నుంచే శివప్రసాద్‌కు నాటకాలంటే ఇష్టమని దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.

 Giridhar Reddy about his friend Chandrababu Naidu

ఆరోజుల్లో చంద్రబాబు సేద్యం చేసేవాడని, నాగలి కూడా దున్నేవాడని, వాళ్ల నాన్నకు సహాయ సహకారాలు అందించేవాడని తెలిపారు. చిన్నప్పటినుంచి పని రాక్షసుడని, వినాయక యువజన సంఘం ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చాడని, అందరిచేత శ్రమధానం చేయించేవారని గిరిధర్ రెడ్డి పాత జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు.

తనకు గుండె ఆపరేషన్ జరిగిన విషయం తాను చెప్పకున్నా.. విషయం తెలిసిన వెంటనే తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని గిరిధర్ తమ స్నేహ మాధుర్యాన్ని వివరించారు.

అంతేగాక, చిన్నప్పటినుంచే చంద్రబాబులో నాయకత్వ లక్షణాలు కనిపించాయని, కానీ సీఎం అవుతాడని ఊహించలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు మిత్రుడిగా ఉండటం తన అదృష్టమని, ఆయనే తన హీరో అని గిరిధర్ అన్నారు. అంతేగాక, నారావారి పల్లెకు వెళ్లినప్పుడు గిరిధర్‌ను చంద్రబాబు తప్పక కలుస్తారని వెల్లడించారు.

English summary
Giridhar Reddy described about his friend and Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X