వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ: బిజెపికి చిక్కని రేఖ, సచిన్ కూడా.. కానీ!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చాలా కాలంగా ఆమోదం కోసం ఎదురుచూసిన జీఎస్టీ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, బిల్లుకు అందరి ఆమోదం కోసం తాపత్రయపడిన కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ సభ్యురాలు రేఖ ఆచూకీ కోసం కూడా ఎంతగానో ప్రయత్నించింది.

తాము మైనారిటీగా ఉన్న రాజ్యసభలో వివిధ పార్టీలను సంప్రదించిన బిజెపి నేతలు.. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ వంటి నామినేటెడ్ సభ్యుల కోసం కూడా దృష్టి సారించారు. రేఖను ఎలా సంప్రదించాలో సూచించాల్సిందిగా సీనియర్ మంత్రులు కాంగ్రెస్ నేతలను అభ్యర్థించారు.

Government Wanted Rekha's Support on GST Too, But Couldn't Find Her

వీరిద్దరు కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన విషయం తెలిసిందే. కాగా, గత నాలుగేళ్లుగా వారు పార్లమెంటుకు చాలా అరుదుగా మాత్రమే హాజరవుతున్నారు. కనీసం జీఎస్టీ బిల్లు ఆమోదం సమయంలోనైనా ఉంటారనుకుంటే.. అది కూడా జరగలేదు. అయితే, రేఖ తొలిసారి ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరవడం గమనార్హం.

రాజ్యసభ జీఎస్టీ గురించి చర్చించినప్పుడు సచిన్ కూడా హాజరుకాలేదు. కానీ, ట్విట్టర్‌లో మాత్రం బిల్లుకు మద్దతు తెలిపారు. 'ఒక దేశం ఒక పన్ను విధానం అమలులోకి వచ్చే జీఎస్టీ వాస్తవం కానుంది. ఇప్పుడది కొంత సమయం తీసుకునే విషయం మాత్రమే. జీఎస్టీ అందించే ప్రయోజనాలకోసం ఎదురుచూడండి' అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

English summary
The government's mission to collect support for the Goods and Services Tax (GST) bill in the Rajya Sabha hit a wall with one elusive member, Rekha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X