హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రికార్డు: 60 సెకన్లలో 79 మందిని కౌగలించుకున్నాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆలింగనాల్లో అతను రికార్డు సృష్టించాడు. అయితే, అతను కేవలం రికార్డు కోసం ఇతరులను కౌగలించుకోవడం లేదు. కష్టాల్లో ఉన్నవారిని వస్తురూపేణా ఆదుకోలేకపోయినా దగ్గరికి తీసుకుని కౌగలించుకుంటే ఎంతో ఉపశమనం పొందుతారని అతను నమ్ముతాడు. అందుకే ఆ కౌగలింతలు.

ఒక నిమిషం వ్యవధిలో రికార్డు స్థాయిలో కౌగిలింతలు ఇచ్చి హైదరాబాద్‌కు చెందిన యువకుడు కృష్ణ గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. కృష్ణకు ఇది నాలుగో గిన్నిస్ రికార్డు. గతంలో ఇతర అంశాల్లో మూడు గిన్నిస్ రికార్డులతోపాటు ఓ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఆయన పేరిట ఉన్నాయి.

నాగోల్‌లోని రాక్‌టౌన్‌లో నివసించే కృష్ణ ఫార్మాసూటికల్ వ్యాపారం చేస్తుంటారు. వికలాంగులు, పేదలకు ఆదుకొనేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. బాధల్లో ఉండే వారికి వస్తురూపేణ సాయం చేయలేకపోయినా వాళ్లు కనీసం వారిపట్ల సానుభూతి చూపాలని, వారిని ప్రేమగా కౌగిలించుకొన్నా చాలునని కోరుతున్నాడు.

He creates record in hugging in hyderabad

ఈ క్రమంలోనే గత మార్చి 5 తేదీన నిమిషం వ్యవధిలో అత్యధిక మందిని కౌగిలించుకున్న రికార్డును సొంతం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. నిమిషంలో ఒక వరుసగా కూర్చున్న వారి దగ్గరకు వెళ్లి, వారు నిలుచున్న తర్వాత ఆలింగనం చేసుకున్నాడు. అలా 60 సెకన్లలోనే 79 మందిని ఆలింగనం చేసుకొన్నాడు.

గతంలో 72 మందిని కౌగిలించుకొని బ్రిటన్ పౌరుడు స్థాపించిన రికార్డును అధిగమించాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ కృష్ణ ఫీట్‌ను పరిశీలించి ఈ నెల 19న ఆయన పేరిట రికార్డును నమోదు చేసింది.

ఆయన గతంలో గంటా 53 నిముషాల్లో వివిధ నాటకాల్లో వివిధ భాషల్లో 9 రకాల పాత్రలు పోషించి గిన్నిస్‌ రికార్డు సాధించాడు. తదనంతరం ఇంగ్లిషులోని 26 ఆల్ఫాబెట్స్‌ని 4.65సెకన్లలో టైపుచేసి రెండోసారి, 16జతల షూస్‌ని 16 బాక్సుల్లో ఒక నిముషంలో సెట్‌చేసి గిన్నిస్‌ రికార్డును మూడోసారి సాధించాడు.

English summary
A Hyderabadi Krishna created record in hugging. It is his third record.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X