వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఈబేలో అందమైన భార్యను అమ్మకానికి పెట్టాడు!

|
Google Oneindia TeluguNews

లండన్: ఆన్ లైన్ కొనుగోళ్లు, అమ్మకాలకు ప్రసిద్ధిగాంచిన ఈకామర్స్ వెబ్‌సైట్లో తమకు అవసరం వస్తువులను అమ్మకానికి పెట్టడం, కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయడం చేస్తుంటారు వినియోగదారులు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తన భార్యను ఈబేలో అమ్మకానికి పెట్టి సంచలనంగా మారాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన జోకెర్ సిమన్ ఓకనె అనే వ్యక్తి తన భార్య లీండ్రా(27)ను ఈబేలో అమ్మకానికి పెడుతూ.. తాను ఎందుకు విక్రయించాలనుకుంటున్నది కూడా పేర్కొనడం గమనార్హం. అంతేగాక, ఆమె సుగుణాల గురించి కూడా పూర్తిగా వివరించాడు. దీంతో రెండు రోజుల్లోనే ఆయనకు 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి.

'ఫర్ సేల్ వన్ వైఫ్' అని అని మొదలు పెట్టిన సిమన్.. లీండ్రా బాగా నవ్వుతుందని, మంచి బాడీ వర్క్, చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని పేర్కొన్నాడు. ఇక వంటపనిలో ఆమెకు తిరుగులేదని చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెలోని మైనస్ పాయింటని తెలిపాడు. ఆమె చాలామంచిదని పేర్కొన్న సిమన్.. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొనడం గమనార్హం.

ebay

లీండ్రాకు దైవభక్తి అస్సలు లేదని, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమాత్రం దైవపూజలు చేయడం లేదని ఇద్దరు పిల్లల తండ్రైన సిమన్(33) పేర్కొన్నాడు. మాటలు, చేతలతో మానసికంగా హింసిస్తోందని, అందుకే ఆమెను అమ్మేయాలనుకుంటున్నానని వివరించాడు.

అయితే ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదంటూ షరతు కూడా విధించాడు. దీనికి నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే వేలాది పౌండ్ల బిడ్లు వచ్చాయి.

ఇక విషయం తెలిసిన లీండ్రా.. కాసేపు నవ్వుకుని, తర్వాత కోపంతో.. 'నేను తప్పకుండా సిమన్‌ను చంపేస్తా'అంటూ భర్త వెంటపడుతోంది. ఈబేలో పెట్టకుంటే తన విలువెంటో తెలిసేది కాదని కూడా ఆమె చెప్పడం గమనార్హం. కాగా, సిమన్ పెట్టిన లిస్టింగ్‌ను వివాదాస్పదం కావొద్దనే ఉద్దేశంతో ఈబే.. కొద్దిసేపటికే తొలగించేసింది.

English summary
A husband prankster took objectifying women to the next level when he put his wife up for sale on eBay like a second-hand car - but was stunned when bids topped the average price of a Jaguar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X