వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ భార్యకు ఆన్‌లైన్ షాపింగ్ చిక్కులు, ట్విస్ట్

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం ద్వారా చిక్కుల్లో పడ్డారు. ఈ కాలంలో ఆన్ లైన్ షాపింగ్ సాధారణమైన విషయం తెలిసిందే. అలాగే సదరు అధికారి భార్య రూ.10 లక్షల మేర ఆన్ లైన్ షాపింగ్ చేసింది.

ఆమె అతి తక్కువ వ్యవధిలో రూ.10లక్షల షాపింగ్‌ చేయడంతో మధ్యప్రదేశ్‌ ఆదాయపు పన్ను శాఖ ఆమెకు నోటీసులు పంపింది. అయితే ఆ ఐఏఎస్‌ అధికారి సన్నిహితులు మాత్రం ఆమె 'కంపల్సివ్‌ బయింగ్‌ డిజార్డర్‌'తో బాధపడుతోందని తెలిపారు.

Online

ఇలాంటి రుగ్మతతతో బాధపడేవారు షాపింగ్‌ చేసేటప్పుడు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తారంటున్నారు. ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆదాయ పన్ను శాఖ ఒక స్మార్ట్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుందని చెబుతున్నారు.

ఈ డిజిటల్‌ మ్యాపింగ్‌ ద్వారానే తక్కువ సమయంలో ఎక్కువ షాపింగ్‌ చేసిన ఆ అధికారి భార్యను గుర్తించి ఆమెకు నోటీసులు పంపించారు. దీనిపై సదరు ఐఏఎస్ అధికారి భార్య వివరణ ఇవ్వవలసి ఉంటుందని చెబుతున్నారు.

English summary
The Madhya Pradesh unit of income tax department has sent a notice to a senior IAS officer's wife over her online shopping spree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X