వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంతి వేయకుండానే 5పరుగులు: జడేజా చేసిన పనికి టీమిండియాకు షాక్

|
Google Oneindia TeluguNews

ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్ రౌండర్ జడేజా చేసిన పనికి అతనికి జరిమానాతోపాటు టీమిండియాకు షాక్‌కు కూడా తగిలింది. ఎందుకంటే ఒక్క బంతి వేయకుండానే న్యూజిలాండ్ స్కోరు 5/0గా స్కోర్ బోర్డుపై కనిపించింది.

వివరాల్లోకి వెళితే.. టీమిండియా 557పరుగుల వద్ద తన తొలి ఇన్నింగ్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఓపెనర్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కాగా, మార్టిన్ గుప్తిల్ తొలి బంతిని ఎదుర్కోకముందే స్కోరు బోర్డుపై 5/0 స్కోరు కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎక్క్‌ట్రాలు ఏమైనా వేశారా? అంటే అదీ లేదు. ఎందుకంటే ఒక్క బంతి కూడా పడలేదు. అయితే, ఆ తర్వాత తెలిసింది దీనికంతటికీ రవీంద్ర జడేజానే కారణమని.

India docked 5 runs after Jadeja runs on pitch

ఇంతకీ అతను ఏం చేశాడంటే.. ఎన్నిసార్లు చెప్పిన్ పిచ్ మధ్యలోంచి పరుగులు తీయడంతో జడేజా మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా విధించారు. అంతేగాక, తన జట్టు టీమిండియాకు జరిమానాగా న్యూజిలాండ్ జట్టుకు 5 పరుగులు ఇచ్చేశారు. దీంతో న్యూజిలాండ్ ఒక్క బంతి ఎదుర్కోకపోయినా 5 పరుగులు పొందింది.

కాగా, బౌలింగ్ చేసేటప్పుడు కూడా జడేజాకు పిచ్ మధ్యలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి అప్పీల్ చేయడం అలవాటు. ఇంతకుముందు కోల్‌కతా టెస్టులో కూడా అంపైర్ రాడ్ టకర్ దీనిపై ఒకటి రెండుసార్లు జడేజాను హెచ్చరించారు.

English summary
In an unusual occurrence, India were handed a five-run penalty after Ravindra Jadeja got a second warning for running on the pitch on day two of the third cricket Test against New Zealand in Indore on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X