వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లియాండర్ పేస్ సాక్షిగా తన ప్రేయసికి సాకేత్ మైనేని లవ్ ప్రపోజల్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత టెన్నిస్‌ రంగంలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న సాకేత్ మైనేని, తన ప్రియురాలి మనసు గెలుచుకున్నాడు. స్పెయిన్‌లో డేవిస్ కప్ టోర్నమెంట్‌కు బయల్దేరే ముందు ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు.

ఈ విందులో సీనియర్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ చూస్తుండగా మోకాళ్లపై కూర్చుని తన ప్రియురాలు శ్రీలక్ష్మికి గులాబీ పువ్వును ఇస్తూ, తనను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు.

సాకేత్ మైనేని చేసిన ప్రతిపాదనకు నవ్వుతూ గులాబీని అందుకున్న శ్రీలక్ష్మీ సిగ్గులొలుకుతూ సాకేత్ మైనేనితో వివాహానికి అంగీకరించింది. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం కాబోయే జంటలు అందరి సమక్షంలో కేక్‌ను కట్ చేశారు. తన సమక్షంలో ఇదే తొలి పెళ్లి ప్రపోజల్ అని లియాండర్ పేస్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

English summary
In what Leander Paes described as the first marriage proposal witnessed by him during a Davis Cup, India’s Saketh Myneni proposed to his girlfriend Sri Lakshmi Anumolu during the official Davis Cup dinner on Wednesday, which the UPSC aspirant agreed to with an “okay”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X