వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుత్తా 'గులాబీ' ట్విస్ట్, 'కుట్ర'ల గుట్టు విప్పిన కేసీఆర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోకుండానే కారు ఎక్కారు. ఇది చర్చకు దారి తీసింది. ఆయన అలా చేయడానికి కారణం ఉందని అంటున్నారు. ఫిరాయింపుల వేటు నుంచి తప్పించుకునేందుకు అలా చేశారని అంటున్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో బుధవారం నాడు కారు ఎక్కిన చేరిన గుత్తా గులాబీ కండువా మాత్రం కప్పుకోలేదు. తన అనుచరులకు దగ్గరుండి మరీ కేసీఆర్‌తో పార్టీ కండువా కప్పించారు. తాను మాత్రం వేసుకోలేదు. సీఎం కేసీఆర్ కూడా ఆయనకు కండువా కప్పలేదు.

బాబును లాగి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, విజయశాంతి మాటేమిటని జానాకు ప్రశ్నబాబును లాగి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, విజయశాంతి మాటేమిటని జానాకు ప్రశ్న

అంతేగాక వేదికపై నుంచి గుత్తా ఏమీ మాట్లాడలేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండానే తెరాసలో చేరిన నేపథ్యంలో సాంకేతిక కారణాలు, అనర్హత వేటు తదితర అంశాల వల్లే ఆయనిలా చేసి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చేరికలు

చేరికలు

కాంగ్రెస్ నేతల చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... టిఆర్ఎస్ అఖండ విజయం సాధించిన అనంతరం పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయకముందే తమ సర్కారును కూల్చేందుకు ఢిల్లీలో, హైరాబాదులో కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు.

చేరికలు

చేరికలు

మమ్మల్ని రాజకీయంగా అస్థిరపర్చాలని చూశారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బెర్లిన్‌ గోడలనే పగులగొట్టారు, ఇదెంతలెక్క అనడంతోపాటు 2019లోపే టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా ప్రభుత్వం కూలిపోతుందన్నారని చెప్పారు.

చేరికలు

చేరికలు

ఈ విషయాన్ని తనకు నిఘావిభాగం వారు చెప్పారని, మజ్లిస్ అధ్యక్షులు అసదుద్దీన్‌ ఓవైసీ వచ్చి తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని తిప్పికొట్టాలని సూచించారన్నారు. ��జ్లిస్ తెరాస ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు.

చేరికలు

చేరికలు

ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాలు భ్రష్టుపట్టాయని జానారెడ్డి అంటున్నారని, కానీ, ఆయన పార్టీనే భ్రష్టుపట్టిందన్నారు. తమకు వేరే ఏ నీతి లేదని, తెలంగాణ తన కాళ్లపై తాను నిలబడాలన్నదే మా నీతి అని చెప్పారు.

చేరికలు

చేరికలు

తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా సుస్థిరమవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇప్పుడు ఫిరాయింపులపై మాట్లాడుతున్న జానారెడ్డి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్‌లో చేర్చుకున్నపుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.

చేరికలు

చేరికలు

తెలంగాణపై ప్రకటన వెలువడ్డ తర్వాత కూడా తమ పార్టీలో ఉన్న సిట్టింగ్‌ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డిలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నపుడు నీతి కనిప���ంచలేదా..? మీరుచేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా..? పార్టీలోచేరికలపై మాకెలాంటి మొహమాటాలు లేవన్నారు.

చేరికలు

చేరికలు

సమైక్యవాదుల కుట్రలకు బలికావద్దన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ, ఆర్థిక సుస్థిరతతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేసీఆర్ చెప్పారు. చరిత్రలో గతమెన్నడూ జరగని అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో జరుగుతోందన్నారు.

అంతకుముందు, కేసీఆర్ రాకముందే వేదిక మీదకు చేరిన గుత్తా.. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్‌కు స్వాగతం పలికి పుష్ప గుచ్ఛం ఇచ్చారు. వివేక్, వినోద్, భాస్కర రావు, రవీంద్ర నాయక్‌లు మాత్రం పార్టీ కండువాలు కప్పుకున్నారు.

ఆ తర్వాత పార్టీలో చేరిన కొత్తవారితో కలిసి కేసీఆర్ వేదిక మీదే ఫొటోలకు ఫోజిచ్చారు. ఈ ఫొటోలోనూ మిగతా వారి మెడల్లో గులాబీ కండువాలు ఉండగా, గుత్తా మెడలో మాత్రం కండువా కనిపించలేదు. కేసీఆర్‌తో పాటు గుత్తా కూడా కండువాలు లేకుండానే కనిపించారు. బుధవారం నాడు కాంగ్రెస్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ సోదరులు, ఎమ్మెల్యే భాస్కరరావు, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌లు తెరాసలో చేరారు.

English summary
KCR defends defections, says it will ensure political stability.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X