వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహత్మా గాంధీ తన భార్యను కొట్టారా! ఎందుకు?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సత్యం, అహింసా మార్గాల్లో భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహాత్మా గాంధీ.. ఒకనొక సందర్భంలో తన భార్యపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రచయిత ప్రమోద్ కపూర్ తాను రాసిన తాజా పుస్తకం 'గాంధీ ఎన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ'లో వెల్లడించారు.

అంతేకాకుండా గాంధీ తన కుటుంబసభ్యుల పట్ల ఓ 'సర్కస్ రింగ్ మాస్టర్'లా వ్యవహరించారని, ఇదే విషయాన్ని ఆయన కుమారుడు హరిలాల్ గాంధీ తన తండ్రికి రాసిన 14 పేజీల లేఖలో తెలిపారని ప్రమోద్ కపూర్ పేర్కొన్నారు.

తన సన్నిహితులు, దగ్గరి శిష్యులతో డిక్టేటర్‌గా వ్యవహరించేవారని కూడా తెలిపారు. దేశంలో ఖాదీ ఉద్యమం ఊపందుకున్న రోజుల్లో విదేశీ వస్త్రాలను విసర్జించి ఖాదీ చీరలనే కట్టుకోవాలని దేశ ప్రజలతోపాటు కస్తూర్భా గాంధీని కూడా మహాత్మా గాంధీ ఆదేశించారట.

New biography claims Gandhi would slap his wife behind closed doors while calling for pacifism in public

బరువైన ఖాదీ చీరను కట్టుకొని తాను ఇంట్లో పనులు చేసుకోనని, ముఖ్యంగా వంట చేయలేనని కస్తూర్భా మొరపెట్టుకున్నారట. ఆ మాటలకు కోపం వచ్చిన గాంధీ భార్యపై చేయి చేసుకున్నారట. అయితే వంట చేయకని, విదేశీ వస్త్రం ధరించి వంట చేస్తే తాను తినని కూడా గాంధీ భీష్మించుకు కూర్చున్నారట.

అప్పుడు భార్య కళ్ల నుంచి మౌనంగా కారిన కన్నీళ్లను చూసిన గాంధీకి అహింస గొప్పదనం గురించి తొలిసారి అనుభవపూర్వకంగా తెలిసిందట. ఖాదీ ఉద్యమాన్ని సీరియస్‌గా తీసుకోని వారిపట్ల మహాత్మాగాంధీ కోపంగా ప్రవర్తించే వారట.

కాగా , గాంధీ మాత్రం తన 98 సంకలనాల్లో గానీ, 'మై ఎక్స్‌పరమెంట్స్ విత్ ట్రుత్' పుస్తకంలోగానీ భార్యను చెంపదెబ్బ కొట్టిన అంశం లేకపోవడం గమనార్హం.

English summary
At the height of the khadi movement, when Mahatma Gandhi exhorted everyone to boycott foreign clothes, Kasturba, his wife, complained that she found it difficult to wear a khadi sari and cook as it was too heavy to do home chores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X