చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమికులకు టీచర్ ఉద్యోగం ఇవ్వబడదు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని చెన్నై నగర శివారులోని కొన్ని విద్యాసంస్థల్లో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. ఈ నిబంధనలతో ప్రేమికులకు ఇక్కట్లు తెప్పడం లేదు. ఎందుకంటే.. ప్రేమ వివాహం, కుటుంబ సమస్యలు, విడాకులు వంటి చిక్కుల్లో ఉన్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం లేదని చెన్నై, నగర, నగర శివారు ప్రాంతాల్లో నడుస్తున్న కొన్ని విద్యాసంస్థలు నిబంధనను ప్రవేశపెడుతున్నాయి.

ప్రేమ వివాహ వ్యవహారాల కారణంగా విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని, అంతేకాకుండా అటువంటి ఉపాధ్యాయుల వల్ల పాఠశాలకు చెడ్డపేరు వస్తుందనే నెపంతో విద్యాసంస్థలు ఇటువంటి కొత్త నిబంధనలను విధిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక, విద్యార్థులకు క్రమశిక్షణ, సన్మార్గం, గురుకుల విధానం ద్వారా విద్యను బోధించాలని నిర్ణయించాయి.

No teacher job for lovers in chennai Schools

ఇందులో భాగంగానే కుటుంబ సమస్యలు ఉన్నవారికి, ప్రేమవివాహం చేసుకున్నవారు, విడాకులు తీసుకున్నవారు, కులాంతర వివాహం చేసుకున్న వారికి ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పలు ప్రైవేటు, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రేమ వివాహం చేసుకున్న విద్యావంతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కాగా, చెన్నైలో ప్రముఖ విద్యాసంస్థలు, సామాజిక ట్రస్టీలు క్రోంపేట, ఆలపాక్కం ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించారు.

అందులో ‘దరఖాస్తు చేసుకోదలచిన గ్రాడ్యుయేట్‌లు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న వారిగానే, ప్రేమ వివాహం చేసుకున్న వారిగానో, కుటుంబ సమస్యల్లో ఉన్న వారిగానో ఉండరాదు' అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని చూసి, దరఖాస్తు చేసుకోదలచిన వారు అవాక్కయ్యారు. ఈ విషయంపై ఆ వర్గానికి చెందిన ఉద్యోగార్థులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

English summary
It is said that no teacher jobs for lovers in Chennai Schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X