వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ చెప్పింది తనకైనా అర్థమైందా: వర్మ సెటైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఈసారి ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాపు రిజర్వేషన్ల విషయమై పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరుపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసలు తనిచ్చిన స్పీచ్ తనకైనా అర్థమైందా? అని అనుమానంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వర్మ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు, కారులో తన పక్కన ఉన్నవాళ్ల చెప్పుడు మాటలతో ప్రభావితమై ఆ స్పీచ్ ఇచ్చారని అన్నారు.

‘కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా.. స్వచ్ఛమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు.. విశ్వదాభి రామ వినుర వేమ' అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి అంటూ... ఒక్కసారి జనసేన పార్టీ స్థాపించిన సందర్భంగా మీరిచ్చిన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి అంటూ విమర్శలు సంధించారు.

Ram Gopal Varma on Pawan Kalyan

అదే సమయంలో.. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాల్ని వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహే అని అన్నారు. పవన్ తన జనసేన లాంచింగ్ స్పీచ్‌ని రిపీట్ మోడ్‌లో చూసి, తన అన్నయ్య కంటే దారుణంగా స్క్రూయింగ్ చేసేముందు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు.

పవన్ అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి అంటూ... తాను చెప్పేదాంట్లో ఎంత నిజాయితీ ఉందో మీ అందరికీ మనసులో నిజం తెలుసు కాబట్టి.. ఆయనకు వాళ్లు కూడా చెప్పాలని కోరారు. వాస్తవం ఏమిటంటే.. కమ్మలలో కొంతమంది కాపులున్నారని, అలాగే కాపులలో కూడా కమ్మలు ఉన్నారని చెప్పారు. అందుకు ఉదాహరణగా చిరంజీవిలో కళ్యాణ్, కళ్యాణ్‌లో చిరంజీవి ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

కాపు రిజర్వేషన్లపై ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో చేసిన ఆందోళన తుని రైలును దగ్ధం చేయడంతో ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ప్రభుత్వ తగిన విధంగా స్పందించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

English summary
Director Ram Gopal Varma fired at Jana Sena Party president Pawan Kalyan's speech on Kapu Reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X