వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్! అమల కుక్కకోసమా: క్షణాల్లో రేవంత్ గాయబ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వవద్దన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఓయులో జరిగిన జనజాతర సభలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయన పాల్గొనడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తనను ఓయూ జన జాతరలో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఆయన గత కొన్నాళ్లుగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనజాతరలో పాల్గొడంపై ఉత్కంఠ ఏర్పడింది. అదే సమయంలో హైకోర్టు కూడా రాజకీయ సభలకు నో చెప్పింది. ఇలాంటి సమయంలో రేవంత్ ప్రత్యక్షమయ్యారు.

ఆయనను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు రేవంత్ రెడ్డిని రహస్య ప్రాంతంలో ఉంచి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఓయూ గ్రంథాలయం సమీపంలోని సరస్వతి దేవాలయం నుంచి ద్విచక్రవాహనంపై తీసుకొచ్చారు. ప్రసంగం పూర్తవగానే పోలీసులు వచ్చేలోగానే వాహనంలో అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోయారు.

ఇలా వచ్చి, ఇలా వెళ్లారు..

రేవంత్ ఓ విద్యార్థిలా ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, జీన్స్ ధరించి, ద్విచక్ర వాహనంపై వర్శిటీలోకి వచ్చారు. ఉస్మానియాలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు ఎదురుగా విద్యార్థులు దూరి వెళ్లగలిగేంత చిన్న దారి ఉండగా, అందులో నుంచి రేవంత్ వచ్చారు.

ఆపై వేదిక వరకూ నడుస్తూ వెళ్లారు. వేదిక వద్ద ఆయన్ను చూడగానే విద్యార్థులు ఈలలతో హోరెత్తించగా, కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డ ఆయన, ప్రసంగం అనంతరం వచ్చినంత రహస్యంగానే వెళ్లిపోయారు. స్టేజీకి వెనుకవైపు ముందే ఏర్పాటు చేసి ఉంచిన నల్లటి కారులో ఆయన బయటకు వెళ్లారని సమాచారం.

సభలో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, ఓయు జన జాతరలో విద్యార్థులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

విద్యార్థులు ప్రజాప్రతినిధులుగా మారి, నిర్ణయాధికారం వస్తే తెలంగాణ చిహ్నంలోని రాజరిక గుర్తులు తొలగించటి అమరుల స్థూపాన్ని చిహ్నంగా మారుస్తామని తెలంగాణ రేవంత్ రెడ్డి జనజాతర సభలో అన్నారు. అలాగే, టీఎస్‍‌గా ఉన్న గుర్తును టీజీగా మారుస్తామని చెప్పారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

తన కుటుంబ సభ్యులకు గంటల్లో రాజకీయ ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు మాత్రం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటీఫికేషన్లు జారీ చేయాలన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఎన్నికల సమయంలో ఓయుకు హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్‌కు విద్యార్థులు చెప్పులు చూపినందుకు కక్ష కట్టారన్నారు. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకుండా, మరోవైపు వర్సిటీకి వైస్ ఛాన్సులర్‌ను నియమించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

అమరులవీరుల పునాదులపై కొందరు రాజకీయ హోదాను అనుభవిస్తున్నారని, రాజకీయ హోదాను అనుభవిస్తున్న ఆ కుటుంబాన్ని మోసే పరిస్థితి విద్యార్థులకు వద్దని కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రస్తావించారు. ఓయూలో విద్యార్థులకు ఉద్యోగాలొస్తాయని అమరవీరులు ఆత్మబలిదానం చేసుకున్నారన్నారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

నీకు, నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి పదవులిచ్చుకునేందుకు గంట కూడా ఆలోచించలేదు. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని కేసీఆర్‌ను విమర్శించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం


తెలంగాణ అమరవీరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి అయిదు శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, హుస్సేన్ సాగర్‌లో బుద్ధవిగ్రహం పక్కనే అమరుల స్తూపం నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

కేసీఆర్‌.. నువ్వు ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రివి, రాజువి కాదని ధ్వజమెత్తారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లకు ఓయూలో 11 ఎకరాలు కావాలన్నారు.. ప్రతిఘటిస్తే వేరేచోటికి మార్చారన్నారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

అమల కుక్కల కోసం మూడెకరాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మిషన్‌ కాకతీయ, భగీరథ పేరుతో రూ.2 లక్షల కోట్ల టెండర్లు పిలిస్తే కమీషన్‌ కోసం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన చినజీయర్‌ స్వామి సలహాలు ఎందుకు రుద్దుతున్నారని నిలదీశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

విద్యార్థి సోదరులు భవిష్యత్తులో ప్రజాప్రతినిధులై, తనకు నిర్ణయాత్మక పదవి వస్తే.. నిజాం, కాకతీయ స్మారకాలను తొలగించి అమరవీరుల చిహ్నాలకు అధికారిక గుర్తింపునిస్తామన్నారు.

 ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయం

రాజకీయ భోగాలు అనుభవిస్తున్న తలసాని, తీగల, తుమ్మల నాగేశ్వర రావులు తెలంగాణా పోరాట యోధులా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

English summary
Telangana TDP working president Revnath Reddy Slams CM KCR At Jana Jatara Meeting In OU.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X