వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే షాక్: సెక్స్ కంటే ఎక్కువ వైఫై కావాలంటున్నారు!

శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని ఐపాస్ సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రస్తుత కాలంలో మాన‌వ జీవితంతో టెక్నాల‌జీకి విడ‌దీయ‌రాని సంబంధం ఏర్పడింది. ప్ర‌స్తుతం వైఫై ఇంటర్నెట్ పేరు విన‌ని వారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. మాన‌వ దైనందిన జీవితాల్లో భాగంగా మారిపోయిన టెక్నాల‌జీ వారిని పూర్తిగా లోబ‌రుచుకుంద‌ని తాజా అధ్య‌య‌నం ఒక‌టి వెల్ల‌డించింది.

ఇంట‌ర్నెట్ వాడ‌కం రోజురోజుకు పెరిగిపోయిన నేప‌థ్యంలో వైఫై ప్రాధాన్యం మ‌రింత పెరిగింది. మ‌నుషుల‌తో పూర్తిగా పెన‌వేసుకుని పోయిన వైఫై వారిని శారీర‌క‌, మాన‌సిక అవ‌స‌రాల నుంచి కూడా దూరం చేసిందని అధ్యయ‌నం తెలిపింది.

romance not important than wifi

అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన 'ఐపాస్' అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు. శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని ఐపాస్ సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పడం గమనార్హం.

37 శాతం మంది తమకు శృంగారం అన్నింటికన్నా ముఖ్యం అని తీర్పునివ్వగా చాకొలేట్‌కు మూడో(14 శాతం), మద్యానికి నాల్గవ(9 శాతం) స్థానం దక్కాయి. వైఫై తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. సాంకేతికతను విజ్ఞానం కోసం ఉపయోగించుకోవాలని గానీ, దానికి బానిసలా మారిపోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
A survey said that romance not important than wifi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X