వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీర్య వృద్ధి కోసం వేట: పాక్‌కి సౌదీ యువరాజు!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: వీర్య వృద్ధి కోసం సౌదీ యువరాజు పాకిస్థాన్ బాట పట్టారు. హుబారా బస్టర్డ్ అనే ఓ రకమైన అడవికోళ్లను వేటాడేందుకు సౌదీ యువరాజు ఫహద్ బిన్ సుల్తాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సాద్ పాకిస్థాన్ చేరుకొన్నారు. వీర్యవృద్ధికి కారణమయ్యే ఈ రకం పక్షుల మాంసం కోసం అరబ్ షేక్‌లు అత్యంత ఆసక్తిని చూపుతారు.

పాకిస్థాన్‌లో అరుదుగా కనిపించే అడవికోళ్ల వేటపై ఉన్న నిషేధాన్ని జనవరి 22న ఆ దేశ సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో వాటి కోసం వేటగాళ్లు భారీగా తరలివెళ్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అజిజ్ అల్ సాద్ ఓ ప్రత్యేక విమానంలో తబుక్ ప్రావిన్స్‌లో ఉన్న దల్బాండిన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నారు.

Saudi prince arrives in Pakistan to hunt endangered bustard

నిరుడు కూడా సౌదీ యువరాజు బృందం రెండువేలకు పైగా అడవి కోళ్లను వేటాడినట్టు బెలూచిస్థాన్ అధికారులు వెల్లడించారు. అరుదైన అడవి కోళ్లపై వేటపై సుప్రీంకోర్టు గత ఆగస్ట్ 20న నిషేధం విధించింది.

అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడంతో నిషేధాన్ని గత నెలలో ఎత్తివేసింది. కాగా, ఇటీవల జరిగిన బాన్ సదస్సులో హుబారా బస్టర్డ్ అరుదైన పక్షి సంపదగా అని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ పేర్కొంది.

English summary
A prince of Saudi Arabia’s royal family has arrived in Pakistan's Balochistan province to hunt the Houbara bustard, days after the country’s Supreme Court lifted a ban on hunting of the endangered bird.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X