వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక కోరిక తీర్చమనడం కూడా అవినీతే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడానికి, లేదా ఆగడానికి తమ లైంగిక కోరిక తీర్చమని అడగడాన్ని అవినీతిగానే పరిగణించి, తగిన రీతిలో శిక్షించాలని రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ సిఫార్సు చేసింది. అవినీతి నిరోధక నూతన బిల్లుపై రాజ్యసభ నియమించిన ఎంపిక సంఘం ఈ విషయంలో లా కమిషన్‌ నివేదికతో ఏకీభవించింది.

Seeking sexual favour is corruption under law proposed by Parliamentary panel

లైంగికపరమైన డిమాండ్లు సహా ఎలాంటి ఇతర ప్రయోజనాలను ఆశించినా అది అవినీతి కిందకు వస్తుందని, ఈ మేరకు చట్టంలో తగిన సవరణలు చేయాలనీ పేర్కొంటూ ఇటీవల నివేదిక సమర్పించింది. అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం అవినీతికి ఉన్న నిర్వచనాన్ని విస్తృతం చేస్తూ 'ఆర్థిక, లేదా ఇతర ప్రయోజనాల'ను లంచంగా పరిగణించాలని పేర్కొంది.

అవినీతి నిరోధక చట్ట (సవరణ) బిల్లు 2013 ప్రస్తుతం రాజ్యసభ పరిశీలనలో ఉంది. న్యాయపరమైన పారితోషికం మినహా ఇంకేం ఆశించినా అది లంచమేనని కొత్త చట్టం చెబుతోంది. కార్పోరేట్లను, వాటి ఎగ్జిక్యూటివ్‌లను అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తీసుకు వచ్చి, ప్రయివేటు రంగంలోని లంచగొండితనాన్ని నేరంగానే పరిగణించాలని కమిటీ సిఫార్సు చేసింది.

English summary
Seeking sexual favour is corruption under law proposed by Parliamentary panel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X