వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా పోలీస్ అదుపులో షారుక్!: 'సుష్మని అడగాల్సింది'

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలోని లస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతనిని అడ్డుకున్నారు. దీనిపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

షారుక్ ఖాన్‌ను ఎయిర్ పోర్టు బయటకు వెళ్లనీయకుండా అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో తనకు ప్రతిసారి అవమానం జరగడంపై షారుక్ ఆవేదన వ్యక్తం చే శారు. ఎప్పుడు అమెరికా వచ్చినా తనకు ఇలానే అవుతోందని అభిప్రాయపడ్డారు.

Shah Rukh Khan Should Contact Sushma Swaraj For Help

తనకు సెక్యూరిటీ బాధ్యతలు తెలుసునని, తాను సెక్యూరిటీని గౌరవిస్తానని, కానీ నేను అమెరికా వచ్చిన ప్రతిసారి అడ్డుకుంటున్నారని షారుక్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్లో స్పందన వస్తోంది.

షారుక్ ఖాన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సంప్రదించాలని, అయితే, ఆమెను సౌమ్యంగా అడగటం మరువవద్దని, ఆమె సాయం చేస్తుందని కొందరు ట్వీట్లు చేశారు. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు కొన్ని బాలీవుడ్ చిత్రాలను చూడాలని, ఇంత పెద్ద హీరోను అన్నిసార్లు ఎలా నిర్బంధిస్తారని, అమెరికా అధికారులు షారూక్ ఫ్యాన్స్ కాబట్టే, ఓ రెండు గంటలు అతనితో గడిపేందుకు ఇలా చేస్తున్నారని జోకులు పేలుస్తున్నారు.

English summary
Actor Shah Rukh Khan was detained at Los Angeles airport by the US immigration department officials on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X