వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు గంగూలీ లేడు, నేనెలా అడగను: రవిశాస్త్రి

|
Google Oneindia TeluguNews

ముంబై: టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రీనే టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కూంబ్లే తెరపైకి వచ్చి కోచ్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ మొత్తం పరిణామంలో పెద్ద డ్రామానే నడిచినట్టు తెలుస్తోంది.

టీమిండియా కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో అసలు కుంబ్లే పేరే లేకపోతే.. టీమిండియా మాజీ సారథి, కోచ్ పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే కమిటీలో ఒకడైన సౌరభ్‌ గంగూలీనే పట్టుబట్టి అతడి పేరు చేర్పించడాన్న సంగతి తెలిసిందే.

అయితే, కోచ్‌ పదవికి మరో ప్రధాన పోటీదారు అయిన రవిశాస్త్రికి ఇంటర్వ్యూ జరిగే సమయంలో అసలక్కడ గంగూలీనే లేడట. ఈ విషయాన్ని స్వయంగా రవిశాస్త్రినే వెల్లడించాడు. కాగా, కోచ్‌ పదవిని ఆశించిన రవిశాస్త్రి.. తనకు ఆ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.

Sourav Ganguly wasn’t there when I was interviewed, says Ravi Shastri

టీమిండియా డైరెక్టర్‌గా 18 నెలలు కష్టపడ్డానని, యువ జట్టుతో అనేక విజయాలు సాధించి పెట్టానని.. అయినా తనకు కోచ్‌ పదవి దక్కలేదని వాపోయాడు. కాబట్టి నిరాశపడిన మాట వాస్తవమేనని అన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పలు విషయాలు వెల్లడించాడు.

'నన్ను వీడియో ఇంటర్వ్యూ చేసిన సమయంలో అక్కడ గంగూలీ లేడు. మరి అతనెందుకు అక్కడ లేడో నేను అడగలేను కదా. సచిన్‌ టెండూల్కర్, వివియస్ లక్ష్మణ్‌, సంజయ్‌ జగ్దాలె చాలా మంచి ప్రశ్నలు అడిగారు. వివిధ ఫార్మాట్లలో జట్టు బాగా ఆడటానికి ఏం చేయాలో నా ప్రణాళికలు వివరించాను. ఆ సమావేశం గొప్పగా సాగింది' అని రవిశాస్త్రి చెప్పాడు.

రవిశాస్త్రి ఇంటర్వ్యూ సమయంలో క్యాబ్‌ సమావేశంలో పాల్గొనడం కోసం గంగూలీ వెళ్లిపోయినట్లు సమాచారం. గత కొంత కాలంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ ఎంతో మెరుగైందని.. ఇలాంటి జట్టుకు కోచ్‌గా వ్యవహరించబోతున్న అనిల్‌ కుంబ్లే అదృష్టవంతుడని రవిశాస్త్రి అన్నాడు..

సహాయ కోచ్‌లుగా వాళ్లే:

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా అభయ్‌ శర్మలు కొనసాగనున్నారు. కోచ్‌ కుంబ్లేను సంప్రదించిన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు వారిని సహాయ కోచ్‌లుగా నియమించినట్లు బీసీసీఐ తెలిపింది. కుంబ్లే స్వయంగా బౌలర్‌ అయినందున బౌలింగ్‌ కోచ్‌ను నియమించలేదని బోర్డు వర్గాలు తెలిపాయి.

English summary
Sourav Ganguly wasn’t present in the selection meeting when Ravi Shastri gave his interview to become India’s head coach. “Ganguly wasn’t there when I was interviewed,” Ravi Shastri told The Indian Express.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X