వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: లోదుస్తుల్లో పరీక్షలు రాయించారు

|
Google Oneindia TeluguNews

ముజఫర్‌పూర్: వారు పరీక్షలు రాసేందుకు వచ్చారు. అయితే, వారిని మొదట బట్టలు ఊడదీయమన్నారు. దీంతో చేసేదేమీ లేక లో దుస్తులతోనే వారు పరీక్షలు రాశారు. వీరంతా ఆర్మీలోని క్లార్క్ పోస్టు కోసం పరీక్షకు హాజరైన అభ్యర్థులు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో చోటు‌చేసుకుంది.

సోమవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులను చొక్కాలు, ప్యాంట్లు విప్పిన తర్వాతే అనుమతించారు అధికారులు. కాగా, కేవలం లోదుస్తుల్లో వారితో రాతపరీక్ష రాయించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే, బీహార్‌లో ఏ పరీక్ష అయినా చూచిరాత, మాస్ కాపీయింగ్‌ అనేది అలవాటుగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

They Stripped To Their Underwear For Army Recruitment Exam In Bihar

కాగా, బీహార్‌లో చూచిరాత, మాస్ కాపీయింగ్ సమస్య తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలోనే ఎలాంటి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా పరీక్ష నిర్వహించామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పాట్నా హైకోర్టుకు దృష్టికి వెళ్లింది.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, కథనాలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రజాప్రయోజనాల దృష్ట్యా సుమోటాగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘటనపై బుధవారం పాట్నా హైకోర్టు విచారణ జరపనుంది.

English summary
They came to take an exam. They were asked to take off their clothes first.In their underwear, hundreds of young men took an exam on Monday in Bihar's Muzaffarpur, for the post of clerk in the army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X