వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు పేలుళ్లు: పోలీసులకు సహకరించిన దొంగలు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని చెల్సియాలో రెండు రోజుల క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసును చేధించేందుకు పోలీసులకు దొంగలు పరోక్షంగా సహకరించారు.

చెల్సియా ప్రాంతంలో అహ్మద్ ఖాన్ రహామీ రెండు బాంబులు పెట్టాడు. అందులో ఒకటి పేలింది. వెస్ట్ 23వ స్టీట్‌లో పెట్టిన బాంబు పేలింది. అయితే, అహ్మద్ ఖాన్ రహామీ పెట్టిన రెండో బాంబు పేలలేదు. ఈ రెండో బాంబును డిజబుల్ చేయడంలో ఇద్దరు దొంగల పాత్ర ఉంది.

ఈ రెండో బాంబును వెస్ట్ 27వ స్ట్రీట్‌లో పెట్టారు. ఆ దొంగలకు తెలియకుండానే ప్రెజర్ కుక్కర్ బాంబును విసిరేశారు. ఆ తర్వాత వారు సూటుకేసుతో వెళ్లారు. ఈ బాంబు నాలుగు బ్లాకులకు అవతల పడింది. ఈ ప్రెజర్ కుక్కర్ బాంబు ఫోన్‌కు అటాచ్ చేసి ఉంది.

Thieves Helped Crack the Chelsea Bombing Case, Sources Say

ఆ తర్వాత విచారణ అధికారులు వచ్చి దానిని పరీక్షించారు. ఆ ఫోన్ అహ్మద్ ఖాన్ రహామీ కుటుంబ సభ్యులదిగా గుర్తించారు. ఆ తర్వాత దాని ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాన్ రహామీని గుర్తించారు. అహ్మద్ ఖాన్ న్యూజెర్సీలోను ఓ బాంబు పెట్టాడు. కాగా, న్యూజెర్సీలో జరిగిన పేలుడులో 29 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

మరో సంఘటనలో న్యూజెర్సీలోని ఎలిజబెత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు పేలుడు పదార్థాలను దొంగలు గుర్తించారు. పట్టుకున్న బ్యాగులను అక్కడే పడేసిన ఆ దొంగలు, వెంటనే పోలీసులకు వారు సమాచారం అందించారు. అహ్మద్ ఖాన్ రహామీనే ఈ బాంబు పెట్టినట్లుగా భావిస్తున్నారు.

English summary
Thieves could have possibly helped law agencies crack the Chelsea bombing case, reported dnainfo, an online media service covering New York City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X